Webdunia - Bharat's app for daily news and videos

Install App

748మంది టిటిడి ఉద్యోగులకు కరోనా... ఐదుగురు మృతి

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (07:54 IST)
టిటిడిలో ఇప్పటి‌ దాకా 748 మంది కరోనా బారినపడినట్లు, ఐదుగురు మరణించినట్లు ఈవో‌ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత…ఇప్పటి దాకా 748 మందికి ఉద్యోగులు, అర్చకులు, భద్రతా సిబ్బంది కరోనా సోకినట్లు చెప్పారు. ఇందులో తిరుమలలో‌ 361, తిరుపతిలో 387 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే 305 మంది కోలుకున్నారని, ఇంకా 338 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

ఇప్పటి దాకా అలిపిరిలో 2, 029 మంది ఉద్యోగులకు, తిరుమలలో 4,532 మంది ఉద్యోగులకు కనోనా పరీక్షలు నిర్వహించినట్లు ఈవో సింఘాల్ తెలిపారు.అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని‌ ఎస్వీబీసిలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై ఈవో‌ స్పందించారు.

అదే సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ఉన్నందువల్ల అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని చెప్పారు. అయితే దీనిపై‌ కొందరు అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని‌ అన్నారు.

దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఆ సమయంలో టిటిడి కార్యక్రమమే ప్రసారం చేసాం తప్ప…ఏ క్రైస్తవ మత కార్యక్రమమో ప్రసారం చేయలేదని జవాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments