Publish Date: Sat, 08 Aug 2020 (19:42 IST)
Updated Date: Sat, 08 Aug 2020 (19:44 IST)
తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈయన భారత జాతీయ కాంగ్రెస్ తరపున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాధ్ ను ఓడించి 16వ లోకసభకు ఎన్నికయ్యారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా
హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. సుధీర్ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధరణ అయ్యింది.
నిన్న ఇద్దరు కుమారులతో కలిసి సుధీర్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా.. ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.