Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertiesment
Calling Bell
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (17:05 IST)
కరోనా బాధితులకు సదుపాయాలు అందించడంలో విఫలమవంతున్నారంటూ సర్వత్రా విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం మేల్కొంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు మొదలు పెట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్స్ వద్ద కాలింగ్ బెల్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తరచుగా రోగుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోగికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డాక్టర్ లేదా నర్సు వచ్చి అతడి పరిస్థితి పర్యవేక్షించాల్సి ఉంటుంది. 
 
రాష్ట్రంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఐసీయూ, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్‌ వార్డుల్లో ఈ బెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇక వీటన్నింటిని రిసెప్షన్‌కు అనుసంధానం చేస్తారు. రోగి బజర్ నొక్కిన దగ్గర నుంచి డాక్టర్ లేదా నర్సు వచ్చేవరకూ బెల్ మోగుతూనే ఉంటుంది. ఇక అటు రోగులకు అందిస్తున్న సేవల పరిశీలనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ