Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ రద్దు...కరోనా ఎఫెక్ట్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:06 IST)
ప్రస్తుత కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని రాజ్ భ‌వ‌న్లో ఎట్ హోమ్ ర‌ద్దు అయింది. స్వాతంత్ర‌ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అవార్డు విజేతలు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పాల్గొనేవారు. కరోనా తీవ్ర‌త నేపధ్యంలో ప్రస్తుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని గవర్నర్ ఆదేశించినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా కోవిడ్ నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అర్హులైన వారందరూ ప్రాధాన్యత ఆధారంగా టీకాలు వేయించుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తగిన ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments