Publish Date: Fri, 13 Aug 2021 (15:23 IST)
Updated Date: Fri, 13 Aug 2021 (15:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు శుక్రవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.
అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. 12 రోజుల్లో 50 బ్లాంక్ జీవోలు ఇచ్చారని.. వాటిలో తేదీ, జీవో నంబర్ మాత్రమే ఉంటోందన్నారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
బ్లాంక్ జీవోలను చూపితే గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. ఇకనైనా అర్థరాత్రి బ్లాంక్ జీవోలు జారీ చేయడాన్ని మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. జీవోలు గవర్నర్ పేరుతో జారీ చేస్తారని.. ఈ విషయంలో ఆయన కూడా బాధ్యత వహించాలని గద్దె రామ్మోహన్ కోరారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.