చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఇటుకల వ్యాపారి కరోనా బాధితులు పసరు మందు పంపిణీ చేశారు. దీంతో ఆయనపై పోలీలుసు బైండోవర్ కేసును నమోదు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏడుచుట్లకోట గ్రామానికి చెందిన ఇటుకల వ్యాపారి గోవిందరాజులు అనే వ్యక్తి కరోనా రోగులకు గత నాలుగు రోజులుగా ఉచితంగా ఓ పసరు మందు పంపిణీ చేస్తున్నారు.
ఈ మందును సుమారుగా 400 మందివరకు తీసుకున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో తహశీల్దార్ రవి ఆయన్ను పిలిపించి విచారించారు. తాను ఏడో తరగతి వరకే చదివానని, తమ కుటుంబానికి నాటుమందు ఇచ్చే నేపథ్యం ఉందని, ఆనందయ్య మందు గురించి తెలుసుకుని తానూ ఇస్తున్నట్లు గోవిందరాజులు వివరించారు.
ఎలాంటి అర్హత లేకుండా నాటుమందు పంపిణీ చేస్తున్న ఆయనపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. మందు పంపిణీ చేసినవారిలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులకు నివేదించినట్లు సీఐ ప్రసాదబాబు స్పష్టం చేశారు.