Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి జైపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (09:25 IST)
సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి ఎస్.జైపాల్ రెడ్డి. కానీ, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా దూరంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన చిన్న సోదరుడు ఎస్.మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. 
 
కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండేవారని.. మా చిన్నాయన పెదనాయన పిల్లలతో సహా అందరితో చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. సమాజంలో నీతి నిజాయితీగా ఎలా ఉండాలనేది ఆయన నుంచే నేర్చుకున్నామన్నారు. 
 
తన నియోజక వర్గం కల్వకుర్తిలో ప్రజలకు ఎంతో సేవ చేశారనీ, అంతేకాకుండా, రాష్ట్రంలోనూ సహాయం ఆర్ధించి వచ్చిన చాలా మందికి ఆయన సహయం అందించారని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 
 
కాగా, కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ వచ్చిన జైపాల్ రెడ్డి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం జులై 28వ తేదీ అర్థరాత్రి కన్నుమూశారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments