Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:24 IST)
విజ‌య‌వాడ‌లోని ఎపిసిసి కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ జాతీయ పతాకాన్నిఎగుర వేసి, అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

అనంత‌రం సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, ఆనాడు మనుషులు మధ్య విభేధాలు పెట్టి బ్రిటీష్ వాళ్లు దోచుకున్నార‌ని, పేదలకు నీడ లేకుండా తెల్లదొరలు అనేక హింసలు పెట్టార‌న్నారు. మహాత్మాగాంధీ నాడు క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చార‌ని, ఎందరో మహనీయులు త్యాగాలతో తెల్ల దొరలు వెళ్లిపోయార‌ని, ఇపుడు న‌ల్ల‌దొర‌లు మ‌ళ్ళీ దేశాన్ని బానిస‌త్వంలోకి తీసుకెళుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, ఆర్.ఎస్. ఎస్. భావజాలంతో బిజెపి పాలకులు ప్రజల మధ్య కుల, మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ‌చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని, అలాంటి బిజేపీకి క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో ప్రజలు తగిన బుద్ది చెప్పాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments