Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బ‌య‌టికి వ‌చ్చేసా, ఇక్క‌డంతా నిర్బంధ‌మే సార్, బాబుతో ఉమ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:20 IST)
నేను జైలు నుంచి వ‌చ్చేసా... ఇక్క‌డ అంతా నిర్బంధ‌మే కొన‌సాగుతోంది సార్ అంటూ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు మాజీ మంత్రి దేవినేని ఉమ వివ‌రించారు. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ‌చ్చారు. ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికిన‌ మాజీ మంత్రి దేవినేని ఉమా, అమరావతి జేఏసీ మహిళా నేతలు, టీడీపీ కార్యకర్తలు... ఉత్సాహంగా జేజేలు ప‌లికారు. 
 
అధినేత చంద్రబాబు రాకతో గన్నవరం విమానాశ్రయం లో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెల‌కొంది. దేవినేని ఉమాను  అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ పై రాజమండ్రి జైలు నుండి విడుద‌లై మొద‌టి సారి అధినేత‌ను క‌లిశారు దేవినేని ఉమ‌. తాను జైలు నుంచి విడుద‌ల అయి, విజయవాడకు వచ్చే సమయంలో హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మూసేసి త‌న‌ను పోలీసుల దిగ్బంధం లో విజయవాడకు తరలించార‌ని అధినేత చంద్రబాబుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వివ‌రించారు. 
 
అమరావతి రాజధాని పోరాటం 600 రోజులు అయిన సందర్భంగా నిన్న అమరావతి తలపెట్టిన కార్యక్రమంలో మహిళలు పై పోలీసుల దాడి చేశార‌ని పార్టీ అధినేతకు అమరావతి జేఏసీ మహిళా నాయకులు వివ‌రించారు. వైసీపీ ఆగ‌డాల‌కు ముగింపు ప‌లికే రోజు వ‌స్తుంద‌ని అధినేత చంద్ర‌బాబు అంద‌రినీ వారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments