Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనులన్నీ డిశంబరులోగా పూర్తి చేయండి: సిఎస్

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ(SSC) సమావేశం  విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ... ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.

ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల రూ.ల అంచనాలతో శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఎపి డిఆర్పి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.

వాస్తవానికి ఈపనులన్నీ 2015-2020 ల మధ్య ఐదేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే కరోనా తదితర కారణాల వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు.దానివల్ల ఈప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈఏడాది వరకూ గడువును పెంచినందున ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు లోగా పనులన్నీ పూర్తి కావాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.
 
ఈసమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండాలోని అంశాలను వివరించారు. ఇప్పటి వరకూ 1452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 73శాతం ఫిజికల్ ప్రోగ్రస్ ను,71శాతం ఫైనాన్సియల్ ప్రోగ్రస్ ను సాధించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments