Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్య‌పీ న్యూ ఇయ‌ర్... విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో కారుణ్య నియామ‌కాలు!

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (19:19 IST)
నూతన సంవత్సర ప్రారంభ రోజున విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్లో ఓ శుభ‌ప‌రిణామం జ‌రిగింది. కొత్త‌గా 14 మందికి కారుణ్య నియామకం ద్వారా  ఉద్యోగ నియామకపు ఉత్తర్వుల‌ను కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అంద‌జేశారు.
 
 
నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తూ, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి కుటుంబం ఈ నూతన సంవత్సరం సంతోషంగా గడపాలనే ఉదేశ్యంతో కారుణ్య నియామకాలు చేశామ‌ని నగర కమిషనర్  ప్రసన్న వెంకటేష్  ఐ.ఏ.ఎస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. నగరపాలక సంస్థలో వివిధ విభాగాల‌లో విధులు నిర్వహిస్తూ, వివిధ అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానంలో వారి పిల్ల‌ల‌కు  14 మందికి కారుణ్య నియామకం కింద‌ ఉద్యోగ అవకాశం కల్పించిన‌ట్లు తెలిపారు. 
 
 
విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, టర్న్ కాక్, శానిటరీ మేస్త్రి, డ్రైవర్, ఆఫీసర్ సభార్దినెట్, వాచ్ మాన్,  పబ్లిక్ హెల్త్ వర్కర్ వంటి పోస్టింగ్ లను కేటాయించామ‌న్నారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ వాచ్ మాన్ లకు యునిఫారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా. జె.అరుణ, మేనేజర్ డి.వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments