సామాన్య ప్రజల సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజల అర్జీలను పరిశీలించాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కు అప్పగించారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, వివిధ శాఖాధిపతులతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు తాము ఎదుర్కోంటున్న సమస్యలను వివరించారు.
స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్ – 7, పట్టణ ప్రణాళిక - 8, రెవెన్యూ – 5, యు.సి.డి విభాగం – 3 మొత్తం 23 అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు.
నగరపాలక సంస్థ ద్వారా కల్పించిన మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ ఆయా విభాగముల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ - 2 కార్యాలయంలో యు.సి.డి విభాగానికి సంబంధించి -1 అర్జీ, సర్కిల్ – 1 మరియు సర్కిల్ – 3 కార్యాలయాలలో ఎటువంటి అర్జీలు రాలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.