Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లపూడికి వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్: దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (22:57 IST)
మంళవారం గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్‌’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో కార్యక్రమం జరగనుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు.

ఇప్పటికే ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్‌ గొల్లపూడి వెళ్లనున్నారు. ఈ క్రమంలో గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలిస్తున్నారు.

సభ ఏర్పాట్లపై ఆయన డీఐజీ పాల్‌రాజ్‌ (టెక్నికల్‌ సర్వీస్‌), దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్, డీసీపీ–2 విక్రాంత్‌ పాటిల్, విజయవాడ వెస్ట్‌ ఏసీపీ డాక్టర్‌ కె. హనుమంతరావులతో చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలోనే ఆయన స్వయంగా యాప్‌ డౌన్‌ లోడ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారని రఘురాం వివరించారు. ఎంపీడీఓ సునీత, రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాస నాయక్, భవానీపురం సీఐ జె. మురళీకృష్ణ, గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments