Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్మోహన్ రెడ్డికి ధైర్యముంటే దళితులపై సాగిన దమనకాండపై నోరువిప్పగలడా?: పిల్లి మాణిక్యరావు

జగన్మోహన్ రెడ్డికి ధైర్యముంటే దళితులపై సాగిన దమనకాండపై నోరువిప్పగలడా?: పిల్లి మాణిక్యరావు
, శనివారం, 19 జూన్ 2021 (12:50 IST)
కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కొంతమంది వైసీపీనేతలు, మంత్రులు లోకేశ్ పై పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని,  వారికి అర్థమయ్యేలా, వారిభాషలోనే చెప్పాలనే ఉద్దేశంతోనే లోకేశ్ మాట్లాడాడనే వాస్తవాన్ని సుధాకర్ బాబు, రఘురామ్ లాంటి వారుగ్రహిస్తే మంచిదని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తేల్చిచెప్పారు. ఆయన జూమ్ ద్వారా తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. 
 
నారా లోకేశ్ కర్నూలుజిల్లాలో పర్యటిస్తూ, అక్కడ జరిగినహత్యల గురించి ప్రస్తావిస్తూ, మనుషులు ఎవరూ ఇలాంటిచర్యలకు పాల్పడరన్నారు. కొన్నికుక్కలుకావాలనే ముఠాకక్షలు, రాజకీయకక్షలు ప్రేరేపిస్తున్నాయని, అలాంటి వాటికి తమప్రభుత్వంరాగానే తగినపద్ధతిలో సమాధానం చెబుతామని మాత్రమే ఆయన హెచ్చరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లపాలనలో 27మంది టీడీపీనేతలను పొట్టన పెట్టుకున్నారని లోకేశ్ చెప్పారు.

దానికి సమాధానంచెప్ప డం చేతగానివారంతా అక్కడ జరిగినహత్యల గురించి చెప్ప కుండా, గతంలో టీడీపీప్రభుత్వంలోఇలాంటి  హత్యలు జరగలేదా అని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రభు త్వంలో ఎక్కడైనా ఒకహత్యజరిగితే, వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు, దోషులనుకఠినంగా శిక్షించడం జరిగిం దని మాణిక్యరావు తెలిపారు.

అదేవిధంగా నేడు జగన్ ప్రభుత్వం తరతమ బేధం లేకుండా, ఎందుకుదోషులను శిక్షించలేకపోతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోం దా అని టీడీపీనేత నిలదీశారు. నారాలోకేశ్ కుక్కలని మాట్లాడాడని, అలా అన్నందుకు  ఆయనకు బుద్ధి చెబుతామంటున్నవారంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వం గురించి మర్చిపోయి, ఆయన వీరుడు... శూరుడని చెప్పడం ముమ్మాటికీ దద్ద మ్మ కబుర్లేనన్నారు. 

జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పక్క నపెట్టుకొని కుర్చీకోసం రాజకీయాలుచేయడాన్ని, ఓట్లకోసం సొంతబాబాయిపై గొడ్డలిపోటు వేయడాన్ని ఎవరూ మర్చి పోలేదన్నారు. వైసీపీప్రభుత్వంలో జరుగుతున్నహత్యలు, ముఠా, ఫ్యాక్షన్ తగాదాలతో, వైసీపీనేతలు చేస్తున్న దారు ణాలతో తమకు, తమప్రభుత్వానికి సంబంధంలేదనిచెప్పగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికిగానీ, హోంమంత్రికిగానీఉన్నాయా అని మాణిక్యరావునిలదీశారు.

రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా నిజమైన వారసుడో సుధాకర్ బాబు, రఘు రామ్ చెప్పాలన్నారు. రాజశేఖర్ రెడ్డికి రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని జగన్ అవసరానికి వాడుకొని వదిలేశాడని, చివరకు తల్లిని,చెల్లిని కూడా ఓట్లకోసం వాడుకొని చివరకు రోడ్లపైన వదిలేశాడన్నారు. వైసీపీనే పెద్ద దొంగలపార్టీ అని, అవినీతిపరులు, ఫ్యాక్షనిస్టులపార్టీ అని మాణిక్యరావు మం డిపడ్డారు.

లక్ష్మీపార్వతి, సంచయిత, శ్రీరెడ్డి అనే శిఖండుల ను అడ్డంపెట్టుకొని జగన్ రాజకీయాలుచేస్తున్నాడన్నారు. రాజులవంశాన్ని సర్వనాశనం చేయడానికిఒక ఆడపిల్లను అడ్డంపెట్టకుంది జగన్మోహన్ రెడ్డికాదా అని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలైందో సుధాకర్ సమాధా నంచెప్పాలన్నారు.

సుధాకర్ వెధవ, స్టుపిడ్, పనికిమాలిన వెధవకాబట్టే,ఇన్నాళ్లూ బయటకురాలేదని తాముకూడా అనగలమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మచిలీప ట్నంలో సొంతకార్యకర్తను చంపేసి, ఆ నేరాన్ని టీడీపీనేత రవీంద్రపై మోపాలని చూశారన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ముఠాతగాదాలు ప్రోత్సహించమనిచెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి లేవన్నారు. అధికారమదంతో వైసీపీ వారు పేట్రేగిపోతుంటే, ముఖ్యమంత్రి, మంత్రులు వారికి కొమ్ముకాస్తున్నారన్నారు.

అధికారంలోకి రావడానికి ప్రజలనుమోసగించడానికి జగన్మోహన్ రెడ్డిలా ముందు, ముద్దులుపెట్టి, తరువాత మోచేతి నీళ్లు తాగించడం లోకేశ్ కు లేదన్నారు. ప్రజలకోసం, ప్రజలపక్షాన లోకేశ్ పోరాడు తుంటే, ఆయన్ని పట్టుకొని వ్యక్తిగత విమర్శలుచేస్తారా? బూతులమంత్రి బూతులు బాగా తిట్టడంలేదని చెప్పి, ఆయన బాధ్యతను సుధాకర్, రఘురామ్ తీసుకున్నట్లుగా అనిపిస్తోందని,వారు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిదని మాణిక్యరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు.

జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడైతే, ఆయనకుదమ్ము, ధైర్యముంటే, రాజకీయహత్యలు, ఫ్యాక్షన్ హత్యలపై తక్షణ మే శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. అలానే దళితులపై జరిగిన దారుణాలపై ముఖ్యమంత్రి నోరువిప్పి సమాధానం చెప్పాలన్నారు. జగన్ రాష్ట్రంలో ఒక విషసంస్కృతిని పెంచి పోషిస్తున్నాడన్నారు.

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన పెంపుడుకుక్కలను టీడీపీపైకి, ఉసిగొల్పడం మానేసి, ఆయనే బయటకువచ్చి సమాధానంచెప్పాలన్నారు. జగన్మో హన్ రెడ్డి, కరోనాది ఒకటే మనస్తత్వమని, అందుకే కరోనా ను అడ్డుపెట్టుకొని ఆయన కలుగులో దాక్కొని నీచరాజకీ యాలు చేస్తున్నాడని మాణిక్యరావు తెగేసిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త!