Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తులపై నోటికొచ్చినట్లు వాగకండి: చంద్రబాబు వార్నింగ్.. తలసాని ఎందుకొచ్చారు?

ఏపీ సీఎం చంద్రబాబుతో టి.టిడిపి నేతల భేటీ ముగిసింది. పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఇపుడు పొత్తుల గురించి మాట్లాడితే క్యాడర్ గందరగోళంలో పడతారని, పార్టీ బలోపేతం

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (16:10 IST)
ఏపీ సీఎం చంద్రబాబుతో టి.టిడిపి నేతల భేటీ ముగిసింది. పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఇపుడు పొత్తుల గురించి మాట్లాడితే క్యాడర్ గందరగోళంలో పడతారని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించనట్లు సమాచారం. అలాగే పొత్తులపై ఇప్పుడే ప్రకటనలు అనవసరమన్నారు. గ్రూపులు వద్దని, పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు టీటీడీపీ నేతలకు సూచించారు.
 
ఈ నెల 12న పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు టిడిపి నేత రావుల పేర్కొన్నారు. త్వరలో కొత్త కమిటీలతో చంద్రబాబు సమావేశం అవుతారని, రాష్ట్ర కేంద్ర కమిటీలో అవకాశం రానివారికి అవకాశం ఇస్తామని రావుల తెలిపారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు తాము బీజేపీతో విడిపోలేదని టీడీపీ నేత సీతక్క స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు ఇంటి ముందు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు. కాన్వాయ్‌తో తలసాని, చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. అదే సమయానికి తలసాని కాన్వాయ్ అక్కడి రావడంతో మీడియా ఆయనను చుట్టుముట్టింది. 
 
రోడ్ నెంబర్ 36కు వెళ్ళడానికి ఇటువైపు వచ్చానని, చంద్రబాబు ఇక్కడ ఉన్న విషయం తెలియదని తలసాని మీడియాకు సర్దిచెప్పి అటువైపు వెళ్లిపోయారు. కానీ తలసాని చంద్రబాబు ఇంటివైపు ఎందుకొచ్చారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాగా తలసాని 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరుపున గెలిచారు. ఆపై టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తలసాని మంత్రిగా కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments