కేంద్ర బృందంతో నేడు భేటీ కానున్న సీఎం జగన్, వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:53 IST)
ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజులపాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈ రోజు ఉదయం 11 గంటల30 నిమిషాలకు సీఎంను కలవనున్నారు. వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎస్ 6వేల 386 కోట్లు నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
 
తాత్కాలిక సహాయక చర్యల కోసం 840 కోట్లు అవసరం కాగా శాస్వత పునరుద్దరణ చర్యకు 4 వేల 439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా 903 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.
 
అలాగే 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని దీనికోసం 483 కోట్లు నష్టం ఏర్పడిందని తెలిపారు. తక్షణ సాయం, తడి ధాన్యం కొనుగోలుపై సడలింపు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు. అయితే వరద కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ఆదుకోవాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments