Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం : రూ.24 వేలు చొప్పున...

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద మూడో విడత నిధులను మంగళవారం జమ చేశారు. 
 
మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేశారు. ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ.24 వేలు చొప్పున నగదు డిపాజిట్ అయింది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.166.14 కోట్లు నేరుగా 69,225 చేనేత కుటుంబాల ఖాతాలకు జమ చేశారు. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం. 
 
నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది.
 
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments