Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి

Advertiesment
బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన టీటీడీ ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:53 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు  దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మ‌న్ గా తిరిగి ప‌ద‌వి పొందిన సుబ్బారెడ్డి తొలిసారిగా అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు.

దుర్గ గుడిలో ఆయ‌న‌కు ఆలయ మర్యాదల‌తో స్వాగతం పలికారు. వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మ వారి ప్రసాదం, చిత్రపటం వై వి సుబ్బారెడ్డి దంపతుల‌కు అందజేశారు.
 
టీటీడీ ఛైర్మ‌న్  వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అమ్మ వారి ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర‌ ప్రజలపై ఉండాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల‌న్నీ సకాలంలో ప్రజలకు చేరాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని, కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్న‌ట్లు సుబ్బారెడ్డి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింధ్ నదిలో భారీ వరదలు.. వెండి నాణేలు దొరుకుతున్నాయ్..!