అబ్బాయి నాకు ఇచ్చిన పదవీకాలం ముగిసిపోతోంది. మరో సంవత్సరం పొడిగించు అంటూ సాక్షాత్తు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి ప్రాధేయపడ్డట్లు సమాచారం. రెండు సంవత్సరాల కాలపరిమితి ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. కాబట్టి నాకు అవకాశం కావాలని తాడేపల్లికి వెళ్ళి అడిగారట.
అయితే అదంతా పట్టించుకోని సిఎం టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు. పాలకమండలిని రద్దు చేసేశారు. దీంతో అలకపాన్పు ఎక్కిన వై.వి.సుబ్బారెడ్డి బెంగుళూరు నగరానికి వెళ్ళిపోయారట. బెంగుళూరులో జగన్ ఇంటికి సమీపంలోనే వై.వి.సుబ్బారెడ్డికి ఇల్లు ఉంది.
దీంతో ఆయన అక్కడకు వెళ్ళిపోయారట. ఎవరితోను మాట్లాడడం లేదట. తనను బుజ్జగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తున్నారట వై.వి.సుబ్బారెడ్డి. విషయం కాస్త జగన్ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే పదవిని కొంతమందికి కొన్నిరోజులే ఉంటుందని ఇప్పటికే సిఎం ప్రకటించారు. అందులో భాగంగానే సొంతవారైనా, ఎవరైనా సరే ఇలాగే ఉంటుందని చెప్పడానికి జగన్ ఇలా చేశారంటూ వైసిపిలో ప్రచారం జరుగుతోంది.