ఏపీ విద్యార్థులారా, ఇది మీ కోసమే.. పెరిగిన సెలవుల కారణంగా తరగతుల సమయాలు పెంపు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:28 IST)
ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా కళాశాలలకు సెలవులను పెంచిన సంగతి విదితమే. అయితే డిగ్రీ, పీజీ చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సర విద్యార్థులకు ఆగస్ట్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
 
కాగా మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ నెలలో తరగతులను నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలస్యం కారణంగా తరగతుల సమయాన్ని రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.
 
పండగలకు ఇచ్చే సెలవులకు సైతం కోత పెట్టనున్నారు. ప్రతి శనివారం కూడా సెలవులు లేకుండా తరగతులు నిర్వహించనున్నారు. ఆగస్ట్ నుండి మే వరకు అన్ని కళాశాలలు, యూనివర్సిటీలు పని చేసేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. రానున్న విద్యా సంవత్సరం, అనగా 2020-21 అకడమిక్ ఇయర్‌ను యథావిధిగా ఉండేలా ప్రణాళికలు రచించారు.
 
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మిగతా సంవత్సరాలలోని విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అయ్యాక పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆగస్ట్‌లో ఇంజనీరింగ్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments