Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూ సెటిల్మెంట్ కోసం బెజవాడలో స్టూడెంట్ గ్యాంగ్ వార్!

Advertiesment
భూ సెటిల్మెంట్ కోసం బెజవాడలో స్టూడెంట్ గ్యాంగ్ వార్!
, ఆదివారం, 31 మే 2020 (14:42 IST)
బెజవాడలో స్టూడెంట్ గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు కత్తులు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేయించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా, ఈ గ్యాంగ్ వారులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. 
 
మొదటి రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ ఆలస్యంగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. యనమలకుదురులో రూ.2 కోట్ల విలువైన భూమి సెటిల్మెంట్‌కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగిందని షాకింగ్ విషయం తెలిసింది. 
 
ఒకే ల్యాండ్‌ వివాదంలో రెండు గ్రూపులు జోక్యంతో హత్యాయత్నం జరిగింది. రాజీ కుదుర్చుకునేందుకు వచ్చి దాడులు చేసుకున్నట్టు తెలియవచ్చింది. ఇరువర్గాల పరస్పర రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాంగ్‌వార్‌లో క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నారు. 
 
అసలు ఇక్కడ జరిగిందేంటో ఓసారి పరిశీలిద్ధాం. ఆదివారం ఉదయం రెండు గ్రూపులు పరస్పరం కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ దాడిలో పలువురు మాజీ రౌడీషీటర్లు పాల్గొన్నట్టు సమాచారం. ఈ స్ట్రీట్ ఫైట్‌లో 30 యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పటమటలో వారంతా దాడులకు తెగబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో మరో 98 కరోనా పాజిటివ్ కేసులు