Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:03 IST)
మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య శుక్రవారం తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలాశౌరిని పేర్ని నాని అనుచరులు అడుకుని "గోబ్యాక్‌ ఎంపీ" అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై ఘాటుగానే స్పందించిన ఎంపీ "బందరు నీ అడ్డానా..!" అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
 
తమకు సంబంధించిన శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఎంపీ బాలాశౌరిని శుక్రవారం కోరారు. దీంతో ఆయన అక్కడకు వెళ్తుండగా.. పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు. ప్రజా సమస్యను పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments