Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లు.. అంతా వారి పుణ్యమే?

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ఇకపై ట్రాన్స్‌జెండర్లు పనిచేయనున్నారు. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు భిక్షాటన, వ్యభిచారం వంటి వృత్తులను ఆశ్రయిస్తున్నారు. అయితే జైళ్ల శాఖ పుణ్యంతో లింగమార్పిడి

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (11:38 IST)
హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ఇకపై ట్రాన్స్‌జెండర్లు పనిచేయనున్నారు. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు భిక్షాటన, వ్యభిచారం వంటి వృత్తులను ఆశ్రయిస్తున్నారు. అయితే జైళ్ల శాఖ పుణ్యంతో లింగమార్పిడి వ్యక్తులకు మంచిరోజులు వస్తున్నాయి. తెలంగాణ జైళ్ల శాఖ ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.
 
అంతేగాకుండా.. హైదరాబాద్ నగరంలో త్వరలో ఏర్పాటుకానున్న ఐదు పెట్రోల్ బంకుల్లో వారికి ఉపాధి కల్పించనుంది. ఈ ఐదు పెట్రోల్ బంకులను ట్రాన్స్‌జెండర్లే పనిచేస్తారు. ఇలాంటి ఉపాధి ద్వారా వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలరని జైళ్ల శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ ఏడాది ఆఖరు కల్లా జైళ్ల శాఖ రాష్ట్రంలో మొత్తం వంద పెట్రోల్ పంపులను నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో ఐదింటిని ట్రాన్స్‌జండర్ల కోసం కేటాయించినట్లు జైళ్లు-పరివర్తన సేవల డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ తెలిపారు. అలాగే జైలు ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల విక్రయం కోసం త్వరలోనే వెయ్యి విలేజ్ అవుట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments