Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్ అవినీతి గురించి పవన్ ఇప్పుడే ఎందుకు ప్రశ్నించారు: శివాజీ

''ఆపరేషన్‌ గరుడ'' పేరిట ఓ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పావులు కదుపబోతోందని సినీ నటుడు శివాజీ నిన్నటినిన్న మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ''ఆపరేషన్‌ ద

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (10:20 IST)
''ఆపరేషన్‌ గరుడ'' పేరిట ఓ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పావులు కదుపబోతోందని సినీ నటుడు శివాజీ నిన్నటినిన్న మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ''ఆపరేషన్‌ ద్రవిడ''లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ''ఆపరేషన్‌ గరుడ'' తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ''ఆపరేషన్‌ రావణ'' కర్ణాటకలో ''ఆపరేషన్‌ కుమార''ను ఆ పార్టీ చేపట్టబోతోందని హెచ్చరించారు.
 
తాజాగా హీరో శివాజీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఏపీలో అవినీతి జనసేనానికి ఇప్పుడు కొత్తగా కనబడుతోందా? అంటూ ప్రశ్నించారు. 
 
ఇసుక, మట్టి విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తాను ముందే ప్రశ్నించానని.. అయితే ప్రజల్లోకి పవన్ కల్యాణ్ అప్పుడెందుకు రాలేదు. ఆ సమయంలోనే ఎందుకు ప్రశ్నించలేదని శివాజీ నిలదీశారు. రోజూ ట్వీట్లు చేసే పవన్, ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 
 
ఇక ఏపీ మంత్రి నారా లోకేశ్ అవినీతి చేశారని పవన్ ఇప్పుడే ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఎప్పుడో దాడి జరిగితే పవన్ ఇప్పుడా ప్రశ్నించేది అని శివాజీ అడిగారు. 
 
ఏపీకి రావాల్సిన యాపిల్, చైనా కంపెనీలు రాకుండా తరలిపోయాయి. ప్రధాని మోదీకి సన్నిహితుడని చెప్పుకుంటున్న పవన్.. ఏపీకి రాకుండా పోయినా కంపెనీలను ఇక్కడకు రప్పించాలని శివాజీ డిమాండ్ చేశారు. పవన్ నిజాయితీగా లేరని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments