రేణూ దేశాయ్ చెంతకు పవన్... ఎందుకో తెలుసా?
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్ చెంతకు చేరినట్టు సమాచారం. అలా ఆయన ఉన్నట్టుండి మాజీ భార్య వద్దకు ఎందుకు వెళ్లారన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
Publish Date: Fri, 23 Mar 2018 (10:50 IST)
Updated Date: Fri, 23 Mar 2018 (10:52 IST)
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణూ దేశాయ్ చెంతకు చేరినట్టు సమాచారం. అలా ఆయన ఉన్నట్టుండి మాజీ భార్య వద్దకు ఎందుకు వెళ్లారన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
నేడు (మార్చి 23వ తేదీ శుక్రవారం) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల ముద్దుల కూతురు ఆద్య పుట్టిన రోజు బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్, రేణు.. ఆద్య బర్త్ డేని గతేడాది కలిసి నిర్వహించారు. ఆద్య స్కూల్‌కు వెళ్లి అక్కడి పిల్లలతో దిగిన పిక్‌ను, ఆద్యకు రేణు, పవన్ కేక్ తినిపిస్తున్న పిక్‌ను రేణు గతేడాది సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ కూడా చేశారు. 'పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి బర్త్ డే రోజు వారితో టైమ్ స్పెండ్ చేయడమే' అని రేణు పేర్కొన్నారు. శుక్రవారం ఆద్య బర్త్ డే సందర్భంగా ఈ ట్వీట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా వీరిద్దరూ కలిసి ఆద్య బర్త్ డే చేయడం అభిమానులకు పండుగలా అనిపించింది. ట్వీట్స్‌తో పవన్, రేణుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.