Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వు లేక నేను లేను' : ఆమెను వదిలివుండలేక యువకుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉండలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి విషం సేవించినప్పటికీ.. ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ప్రియురాలు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్‌ కుమార్‌(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యను గట్టిగా మందలించాడు. అయినప్పటకీ.. వారిద్దరి మధ్య బంధం కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో మరోమారు భార్యను భర్త హెచ్చరించాడు. ఈ క్రమంలో ఒకరివదిలి మరొకరు ఉండలేని వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం గ్రామం నుంచి కనిపించకుండా పోయారు. మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయారు. 
 
సాయంత్రం ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. దిలీప్‌ అప్పటికే చనిపోయాడు. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments