టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహ
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు రెచ్చిపోతున్నారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు సహనానికీ ఓ హద్దు ఉంటుందని, ఆయన అలిగితే పరిస్థితులు విషమిస్తాయన్నారు. "అంత దూరం తీసుకురావద్దు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు" అని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని, అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే తాము నిరసనలకు దిగినట్టు తెలిపారు.