Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంవోను తాకిన టీడీపీ నిరసన సెగలు.. నేడు మోడీతో ఎంపీల భేటీ

విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై అధికార టీడీపీ గళమెత్తింది. ఢిల్లీలోని పార్లమెంట్‌ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసనలు, నోటీసులు, డిమాండ్లు, చ

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (09:44 IST)
విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై అధికార టీడీపీ గళమెత్తింది. ఢిల్లీలోని పార్లమెంట్‌ వేదికగా చేసుకుని టీడీపీ ఎంపీలు నిరసనలు, నోటీసులు, డిమాండ్లు, చర్చలు... ఇలా అన్ని విధాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలకు పిలుపువచ్చింది. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో పాటు.. మరో నలుగురు ఎంపీలు భేటీకానున్నారు. 
 
నిజానికి నవ్యాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎంపీలు బహుముఖ వ్యూహం మొదలుపెట్టి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు. సోమవారం ఉదయం నుంచే టీడీపీ ఎంపీలు ఢిల్లీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. పార్లమెంట్ వేదికగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో స్వల్ప వ్యవధి చర్చకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు కోరుతూ నోటీసులు సమర్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 
 
ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి చెందిన ఎంపీలు ఈ తరహా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగి టీడీపీ ఎంపీలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత చర్చల సారాంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యేందుకు ఆయన సముఖత వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments