అరె భయ్... వపన్ కల్యాణ్ మన వ్యక్తే.. బాగా చూసుకోండి : కేసీఆర్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తనను కలిసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఉండిపోకుండా తన పక్కనే ఉన్న పలువురు తెరాస ఎం
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తనను కలిసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఉండిపోకుండా తన పక్కనే ఉన్న పలువురు తెరాస ఎంపీలకు పవన్‌ను పరిచయం చేశారు. "వపన్ కల్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్‌ను బాగా చూసుకోండని" అని పార్టీ నేతలకు ఆయన సూచించారు.
కాగా, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు కేసీఆర్‌తో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను డిన్నర్ చేయాలని కేసీఆర్ కోరడంతో పవన్ అక్కడే భోజనం కూడా చేశారు. భేటీ సమయంలో రాజకీయ అంశాలు, సమస్యలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. మరోవైపు, పవన్‌ను బాగా చూసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్‌ను పవన్ అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఇంత తక్కువకాలంలో ఇంతటి ఘనత సాధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరి భేటీలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.