Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని... ఉక్రెయిన్‌లో నానా ఇక్కట్లు పడుతూ అలా..?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:42 IST)
ఉక్రెయిన్ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. ఏక్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోను నెలకొంది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే వేలాదిమంది ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి భారతదేశం నుంచి వెళ్ళిన వేలాదిమంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయారు.

 
అందులో చిత్తూరు జిల్లా వాసులే అధిక సంఖ్యలో ఉన్నారు. జిల్లా నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా ఉంది.

 
తినడానికి తిండి లేక హాస్టళ్ళలోనే ఉంటూ నరకయాతనను అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు తమ ఆవేదనను సెల్ఫీ వీడియోల ద్వారా వివరిస్తున్నారు. అందులో తంబళ్ళపల్లి మండలం బి.కొత్తకోట పట్టణం డీసెంట్ కాలనీకి చెందిన శంకర్ కుమార్తె సాయి నికిత ఉంది. 

 
సాయి నికిత ఉక్రెయిన్ లోని క్యూ రాష్ట్రంలో బోగో మిల్లెట్స్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. నిన్నటి నుంచి బాంబుల మోతతో భీకరమైన శబ్ధాలతో మిస్సైల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 
దీంతో వైద్య విద్యార్థులు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. సాయి నికిత తన గది నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. స్వస్థలానికి వద్దామనుకుంటే కనీసం రవాణా సౌకర్యం కూడా లేకపోవడం.. ఎటిఎంకు వెళ్ళి డబ్బులు తీసుకుందామనుకుంటే బయటకు వెళ్ళలేని స్థితి. 

 
ఇలా పస్తులతోనే సాయి నికిత ఇబ్బందులు పడుతోంది. ఆమె ఒక్కతే కాదు. ఇంకా చాలామంది ఇదే విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి భారతదేశ ఎంబసీ అధికారులతో మంతనాలు జరిపారు. సురక్షితంగా వైద్య విద్యార్థులను తీసుకురావాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments