Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మెత్తకాయల ద్రావణం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:50 IST)
నాటు సారా తాగినా, ఉమ్మెత్తకాయల ద్రావణం తాగినా కరోనా వైరస్ రాదంటూ చిత్తూరు జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. దీన్ని నమ్మి ఉమ్మెత్తకాయల ద్రావణం తాగిన ఏడుగురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలం, ఏ.కొత్తూరు గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
కరోనా వైరస్ నివారణ కోసం ఉమ్మెత్తకాయల ద్రావణం తాగడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ నివారణ కోసం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. సారా తాగినా కరోనా నివారించవచ్చునని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వాటిని నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ... కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు గుంటూరులో నమోదైంది. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments