Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌ల కొనుగోలుపై ఆరోపణలు సరికాదు: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:16 IST)
అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. 

గురువారం చిత్తూరు జిల్లాలో  104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు. 

ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే అత్యాధునికమైన అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని నారాయణ స్వామి తెలిపారు. 
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసే ముందు నిజాలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments