Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్... నా రాజకీయ గురువు చంద్రబాబే.. ఆయన నాకు దైవంతో సమానం : సుజనా చౌదరి

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (17:10 IST)
నిజమే.. నా రాజకీయ గురువు చంద్రబాబే.. ఆయనకు నాకు దైవంతో సమానం అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి ప్రకటించారు. దివంగత నేత అరుణ్ జైట్లీ సహకారంతోనే తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు. తనకు ప్రాంతీయ పార్టీలు సెట్ కావని జాతీయ పార్టీలోకి వెళ్లాలని ఉందని జైట్లీతో చెప్పానని, దాంతో ఆయన బీజేపీలోకి ఆహ్వానించారని తెలిపారు. జాతీయ పార్టీలో పని చేయాలనే కోరికతోనే బీజేపీలోకి వెళ్ళినట్టు చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ తనకు రాజకీయ గురువు మాత్రం చంద్రబాబేనని చెప్పారు. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారని, తనకు చంద్రబాబు కూడా దైవంతో సమానమన్నారు. 
 
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కోసం పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా పని చేశారన్నారు. ఏపీ ప్రజల కోసం ఆయన ఓ త్యాగమూర్తిలా మారారని చెప్పారు. సొంత అన్నయ్య నాగబాబు టిక్కెట్‌ను కూడా ఆయన పొత్తు కోసం వదులుకున్నారని చెప్పారు. 
 
మరోవైపు, జనసేన పార్టీని వీడి వైకాపాలో చేరిన విజయవాడ వెస్ట్ జనసేన నేత పోతిన మహశ్‌.. సుజనా చౌదరి, పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. వీటిపై సుజనా చౌదరి స్పందించారు. మహేశ్ ఏం మాట్లాడినా జనసేన  పార్టీ శ్రేణులు ఎవరూ కూడా స్పందించరాదని సూచించారు. ఆయన స్థాయికి మనం వెళ్లొద్దని, ఆయన దుర్భాషలాడొద్దని, మన గ్రాఫ్ పెంచుకుంటూ పోదామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments