Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేము అధికారంలోకి రాగానే వాలంటీర్‌కి నెల జీతం రూ. 10,000 ఇస్తాము: చంద్రబాబు నాయుడు

Advertiesment
Chandrababu

ఐవీఆర్

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (16:03 IST)
వాలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని వైసిపి దుష్ప్రచారం చేస్తుందనీ, అది నమ్మవద్దని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాలంటీరు వ్యవస్థను తాము రద్దు చేయబోమని అన్నారు. అంతేకాదు.. అధికారంలోకి రాగానే వాలంటీరు నెల జీతాన్ని రూ. 10,000 చేస్తామని హామీ ఇచ్చారు.
 
ఏపీ అభివృద్ధి బాటను పట్టించేందుకే తాము కూటమిగా ఏర్పడినట్లు చెప్పారు. వాలంటీర్లకు తాము అండగా వుంటామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తామంటూ తమపై దుష్ప్రచారం చేసేవారి మాటలు నమ్మవద్దని తెలిపారు.
 
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీని పూర్తి అప్పుల్లో ముంచేసారనీ, అభివృద్ది మాటే లేకుండా చేసారని మండిపడ్డారు. రాజధాని అనేది ఎక్కడ అనే ప్రశ్నించుకునే పరిస్థితులు తెచ్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. అందుకోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపాతో కలిసి తాము చేతులు కలిపామన్నారు. అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు తప్పనిసరి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా.. తిన్న వారంతా వాంతులు