Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చరిత్ర హీనుడు: సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (08:43 IST)
ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనుడిగా మారినా కుట్రలు మానలేదని, కుయుక్తులతో ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 
 
"వైయస్ జగన్ మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఏడాది పూర్తయి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పామో గత వారం రోజులుగా ముఖ్యమంత్రిగారు స్వయంగా కూర్చుని సమీక్షించారు. కార్యక్రమాలలో పధకాలలో మార్పులు చేయాల్సిఉంటే స్టేక్ హోల్డర్స్ తో చర్చించారు. ఇది ప్రజలంతా చూశారు.
 
గత ఏడాది 50 శాతం పైగా ఓట్లతో 151 సీట్లతో జగన్ ని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కోల్పోయి,చరిత్రహీనులుగా మిగిలిపోయిన తెలుగుదేశంపార్టీ నేతలు,పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నెల తిరగకముందే కుట్రలు ప్రారంభించారు.
 
ప్రజలు నిర్మోహమాటంగా టిడిపిని చెంపపై కొట్టినట్లుగా ఇకపై మీరు మాకు అక్కర్లేదని చెత్తబుట్టలో వేశారు.ఇకపై ఉన్నటిడిపి సజీవంగా ఉంచడానికి....తమ తాబేదార్లుగా ఉన్న ఎల్లోమీడియాతోపాటు కోర్టులను వేదికగా వాడుకుని,శాసనమండలిని వాడుకుని ప్రభుత్వంపై కుట్రలు కొనసాగిస్తున్నారు.  
 
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం,ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపడం కాకుండా, వారనుకున్న ప్రణాళికప్రకారం వారు చేయాలనుకుంటున్నవిధంగా అజెండా తయారుచేసి మేధావులు,రాష్ర్టంలో ఉండని విశ్లేషకులను ఇంప్రెస్ చేసి సమాజాన్ని విషతుల్యం చేయాలని జగన్ అధికారంలోకి వచ్చిన నెలరోజులనుంచే చంద్రబాబు అండ్ కో ప్రారంభించింది.
 
పాతపత్రికలు,అప్పట్లో ఛానల్స్ ప్రసారాలు తిరగేసినా ఆ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఆరోజు దృష్టి మళ్లించడానికి చేసినట్లుగా మనకు కనపించినా మొత్తంపై ఏదో ప్యాటర్న్ కనిపిస్తుంది.అదేమంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఇలాంటివాటికి ఒడిగట్టారు.
 
వారికి(టిడిపి) సాధారణంగా ఉండే లిటిగెంట్ లక్షణాలను వాడుకుని ముందుకు వెళ్ళారు.మనం అన్ని చోట్ల చూస్తున్నదే. సాధారణంగా కోర్టుపక్షుల గురించి వింటుంటాం. ఇంత అన్యాయంగా పిల్స్ వేస్తున్నారు.ప్రజాప్రయోజనవ్యాజ్యాలను కూడా దాటి చాలా సంకుచితమైన మామూలు వాటికి కూడా కోర్టులకు పోతున్నారు. ఇదేం అన్యాయమని జగన్ అభిమానులు బాధపడేలా చేశారు.
 
జగన్ చట్టవిరుధ్దమైనవి,రాజ్యాంగవిరుద్దమైనవి చేస్తున్నారు కాబట్టే కోర్టులో ఇలాంటివి వస్తున్నాయని సమాజంలో దుష్ప్రచారం చేేసేలా చేయాలనే వారి(టిడిపి) విషతుల్యమైన ఆలోచన. నిజానికి ఏడాదికాలంలో 3 కోట్ల 58 లక్షలమందికి నేరుగా ప్రభుత్వంనుంచి లబ్దిచేరింది.40 వేల కోట్ల రూపాయలకు పైగా ఈ మేలు ఉంది.
 
చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి రావడానికి రుణమాఫి,మీ బంగారం మీ ఇంటికి వస్తుందంటూ టివిలలోను, పత్రికలలోను బాకాలూదారు.ఎడాపెడా హామీలిచ్చారు.ఆఖరుకు చూస్తే రైతులకు రుణమాఫి రూపంలో 87 వేల కోట్లరూపాయలు చేస్తానని చెప్పి కేవలం 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫి చేసి మోసం చేశారు.
 
చంద్రబాబు మాటలు నమ్మి రైతులు,డ్వాక్రామహిళలు రుణాలు చెల్లించకపోవడం వల్ల చాలా నష్టపోయారు. వారి రేటింగ్ బ్యాంకులవద్ద పడిపోయి రుణాలు పుట్టని పరిస్దితి వచ్చింది. ఆ నష్టం లెక్కవేస్తే చంద్రబాబు చేసింది జీరో.
 
జగన్ ఏడాదిలోపే రైతులకు దాదాపు పదివేల కోట్ల రూపాయలపైన మేలు చేకూర్చారు. జగన్ తాను చెప్పిందానికంటే మిన్నగా రైతులకు రూ. 12,500 చొప్పున నాలుగేళ్ళు ఇస్తానని చెప్పినా,వాస్తవంలో రూ.13,500 చొప్పున ఐదేళ్లు ఇస్తున్నారు. అంతా పారదర్శకంగా చేశారు. ఆర్ టి ఐ కింద అడిగినా తెలిసిపోతుంది.
 
ఇవిగాకా చెప్పుకుంటే పోతే మేనిఫెస్టోలో 90 శాతం అమలు కావడం,లేకుంటే అమలుకావడానికి తేదీలు ఖరారు చేయడం జరిగింది. బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే తాను ఎన్నికలలో ఎందుకు ఓడిపోయానో ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు వెళ్లాలి. రాజకీయం అంటే కుట్రలు,కుతంత్రాలు అని కాదు.నిజంగా సేవ చేయడం ఎలా ఉంటుంది.ఎంత హార్డ్ వర్క్ అంటే.... రేయింబవళ్లు దృష్టి పెట్టాలి. ఖజానాకు నష్టం కలగకుండా ప్రజలకు లాభం చేకూర్చాలంటే మంచి ఆలోచన చేయాలి.
 
లోకేష్ ను వారసుడిగా తెచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి జగన్ లా పనిచేయి ఇలా చేస్తే బాగుపడతావు నా పధ్దతిలో చేయకు అని అన్నా చంద్రబాబు చెప్పాలి.అలా చెప్పగలిగితే చంద్రబాబు వయస్సుకు సార్ధకత ఉంటుంది. ఆ విధంగా చంద్రబాబు అస్సలు ఆలోచించడం లేదు.అలా లేకపోగా ఏడాదిగా నేరుగా జగన్ గారి ప్రభుత్వంపై ఎటాక్ చేయడం చేస్తున్నారు.
 
మీరు చేసినపనులలో రివర్స్ టెండరింగ్ కు వెళ్తే 2 వేల కోట్ల రూపాయలు ఖజానాకు మిగిలాయి.నిజంగా టెండర్లు అమలు జరిగి ఉంటే రాష్ర్టానికి నష్టం జరిగి ఉండేేది.అది అబద్దమా చెప్పండి.దానిగురించి మాట్లాడరు. మీరు చేసిన క్యాబినెట్ మీటింగ్స్ లో టెండర్లను ఖరారు చేయడం,బ్యాంకులకు పూచీలతో సహా చేశారు.అప్పటి మినిట్స్ లో చూస్తే అర్ధమవుతుంది.
 
నేడు  ఒక్కసారి కూడా అది జరగకపోగా టెండర్ల విషయంలోజ్యుడిషరీ కమీషన్ ఏర్పాటుచేసి దానికి ఇదంతా అప్పగించారు.జగన్ గారు ఇది ఎంతో సాహసంతో నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషరీ కమీషన్ అంటే ఇండిపెండెంట్ సంస్దకు ఇస్తున్నట్లు.రాజకీయనేతలంతా ఎలా పవర్ ను సెంట్రలైజ్ చేయాలని చూస్తుంటారు.పవర్,ఫైనాన్సియల్ విషయాలలో అలా చేస్తుంటారు.కాని జగన్ దానిని వదలివేస్తున్నారు.
 
ప్రజాసేవలో ఉండటమంటే నిప్పులగుండంలో నడిచినట్లు ఉండాలని ఆయన చెప్పిన పరీక్ష.మిమ్మల్ని పొగడమని అడగట్లేదు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన వాటిల్లోనే రెండువేల కోట్లు మిగిలాయంటే,కాస్ట్ పెరిగింది కాబట్టి అవి నేడు మూడువేల కోట్లు అయినా ఉంటాయి. మిగిలిన టెండర్లన్నీ లెక్క చూస్తే ఇంకా ఎంత మిగిలేవి.
 
బిజేపి రాష్ర్ట అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ చంద్రబాబు మూడులక్షలకోట్లు అవినీతి అంటున్నారు... ఏడాదిలో ఏమి బయటకు తీశారని అంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రెండువేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రూవ్ చేశాం.ఇది టిప్ మాత్రమే. 
 
టిడిపి హయాంలో స్కామ్ లు జరిగినాయా లేదా అనేది చూస్తే.... ఏ అనుమానం లేకుండా అసెంబ్లీ సెక్రటేరియట్ భవనాలు చూస్తే వాటి వ్యయం చూస్తే ఇట్టే అర్దమవుతుంది. సిఆర్ డిఏ తీసుకున్న భూములలో డికేటి భూములకు(లాగేసుకుంటారని అగ్రిమెంట్ చేసుకున్నారు) అగ్రిమెంట్ చేసుకుని తర్వాత పరిహారం తీసుకున్నవాటిలో పెద్ద అవినీతి కనిపిస్తుంది.
 
 దోషులు ఎందుకు పట్టుబడలేదంటారా...ఇది ప్రజాస్వామ్యం..మీరన్నట్లు చేయాలంటే....సౌదిఅరేబియా లోలాగా తీసుకువచ్చి ఇది ఆరోపణ.... ఇది జడ్జిమెంట్... అని చేయాలి.అలాంటి పార్టీ కాదు మాది.జగన్ కి అలాంటి ఉధ్దేశ్యాలు లేవు.దానికి ఏజన్సీలు, కోర్టులున్నాయి. 
 
టిడిపి దాంతో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీ కలసి 2014 ఎన్నికలకు ముందు ఎంత దుష్ప్రచారం చేసినా దొంగకేసులు పెట్టినా,మూడు నెలల్లోగా బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా16 నెలలు అక్రమంగా జైలులో పెట్టారు.
 
కేసులు అక్రమం,దర్యాప్తు అక్రమం  మళ్లీ మళ్లీ రీకాల్ చేసుకోవాలి.ఆరోజు జడ్జి గా చేసిన వ్యక్తిని తీసుకువచ్చి హ్యూమన్ రైట్స్ కమీషన్ గా పెట్టారు.అది క్విడ్ ప్రోకో అంటే.ఇది ప్రజలందరికి తెలుసు.
 
కేసులు...ఇంకా అనేకం పెట్టి మహానాయకుడి కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చి బాధలు పెట్టినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.జగన్ గారిని అక్కున చేర్చుకున్నారు. 2014లో నూతన పార్టీ అయినా జగన్ ని ఆదరించారు.రుణమాఫి హామీతో కేవలం కొద్ది ఓట్ల తేడాతో టిడిపి గెలవగలిగింది.
 
ఇంత ఘనచరిత్ర కలిగిన టిడిపికి,చంద్రబాబుకు ప్రజలు 2019 లోవాస్తవాలు గ్రహించి 23 సీట్లు మాత్రమే ఇచ్చి గట్టిగా బుధ్ది చెప్పారు.  ఈఏడాది పాలనలో జగన్ అద్భుత రికార్డు ఎక్కడ జనం మెదళ్లలో  ఎక్కుతుందో అనే భావనతో చంద్రబాబు అండ్ కో కుట్రలకు తెరలేపింది.కోర్టులకు వెళ్లిన పిల్స్ అన్నీ చూస్తే వాస్తవం ఇట్టే అర్ధమవుతుంది.ఆ పిల్స్ తరపున వాదించడానికి వచ్చిన లాయర్లను చూస్తే వాస్తవం అవగతమవుతుంది.
 
ఎవరూ పట్టించుకోని వ్యవహారాలలో మాత్రమే పిల్స్ వేస్తారు.ఇసుక,శాండ్ పై ఏజన్సీని క్రియేట్ చేస్తే దానిపై కూడా పిల్ వేశారంట.రోడ్డుపై తాగి సిఎం వంటివారిని బండబూతులు తిడుతున్నా అలాంటివ్యక్తికి సపోర్ట్ గా పిల్ వేశారు.పిల్స్ తరపున ఉన్న లాయర్లను చూస్తే వాటి వెనక ఎవరు ఉన్నారో అర్ధమవుతుంది.
 
చిన్న చిన్న కేసుల విషయంలో పిల్స్ వేసి దానిని వాదించడానికి పెద్దలాయర్లు వస్తున్నారంటే దాని వెనక వెస్ర్టన్ ఇంట్రస్ట్ ఉన్నట్లే. ప్రైవేటు భూములు ప్రభుత్వం తీసుకుంటే నష్టపోయినవాళ్లు కోర్టుకు వెళ్తారు.భూములు పారిశ్రామికవేత్తలకు ఇస్తుంటే పోరాటాలు చేసే కమ్యూనిస్టులు వస్తుంటారు.ప్రభుత్వ భూములు పేదలకిస్తుంటే  అది స్టాప్ చేయాలని కోర్టులకు వెళ్లారు.
 
వికేంద్రీకరణ సంబంధించి,ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసినా ఎన్నో కేసులు వేశారు.గతంలో టిడిపి అన్నా క్యాంటిన్ లకు రంగులు వేశారు.దానిగురించి మాట్లాడలేదు. మనకు శాసనవ్యవస్ధ,ఎగ్జిక్యూటివ్,న్యాయవ్యవస్ధలు ఉన్నాయి.ఎగ్జిక్యూటివ్ కున్న పవర్స్ లోకి వేరే వ్యవస్ధ ఎంటర్ అయితే  అది సిస్టమ్ కు హాని చేస్తుందని కోర్టు కూడా చెబుతుంది.
 
పదే పదే కోర్టులకు వెళ్తుంటే ప్రచారం అయినా వస్తుంది.కోర్టులు డిస్ మిస్ చేసినా వారి పర్సస్ సర్వ్ అవుతుంది.వారి పత్రికలలో అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తుంటారు.టిడిపి, చంద్రబాబు ఆలోచన అదే. ఇంగ్లీషు మీడియం విషయంలో కూడా అదే విధంగా వెళ్ళారు.స్దానిక సంస్ధలు వచ్చిన దగ్గర్నుంచి మొత్తంగా చూస్తే ఎస్ ఇ సి విషయంలో జరిగిందంతా చూస్తే అదే అర్ధమవుతుంది.స్టేట్ ఎలక్షన్ కమీషన్ అనేది ఇండిపెండెంట్.

అయితే ఎస్ ఇ సి.... రాష్ర్ట ప్రభుత్వం తో సంప్రదింపులుతో నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల ప్రాసెస్ లోఅధికారపార్టీకి అవకాశాలు ఉండే పరిస్ధితి ఉంటుంది కాబట్టి నిష్పాక్షికత కోసం ఎస్ ఇ సిని ఇండిపెండెంట్ గా ఉంచారు. అంతా గమనిస్తే నోటిఫికేషన్ కు ముందు కరోనా నేపధ్యంలో ఎన్నికలు పోస్ట్ పోన్ చేయండి అని పలు పార్టీలు అడిగితే, ఇదే ఎస్ ఇ సి మేం రిపోర్ట్స్ తీసుకున్నాం, ఎన్నికల వాయిదా అవసరం లేదని స్పష్టంగా చెప్పింది.

రాష్ర్టప్రభుత్వంతో సంప్రదించి చేశారు. మరి అలా చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసేటప్పుడు ఆ విధంగా ఎందుకు చర్చించలేదు.అలా హడావుడిగా ఎందుకు చేయాల్సివచ్చింది.టివిలలో చూసి అందరూ తెలుసుకోవాల్సిన పరిస్ధితి ఎందుకు తెచ్చారు.పౌల్ ప్లే అని అర్ధమయింది.
 
ఇంత జరుగుతున్నా సమాధానం లేదు.ఎస్ ఇ సి వెళ్తూ కేంద్రానికి లెటర్ రాసిన విషయం బయటకు రావడం.రమేష్ కుమార్ నేను రాయలేదనడం జరిగింది.ఈలోపు టివి ఛానల్స్ లో ప్రచారం.అంతా చూస్తే ఏదో జరుగుతుందనే స్మెల్ వచ్చింది.
 
అంతా జరిగాక ఆయన కోర్టుకు వెళ్లాడు.అదే సమయంలో టిడిపి కోర్టుకు ఎందుకు వెళ్లింది.తర్వాత చూస్తే మొత్తం పదిపిల్స్ వచ్చాయి.లాయర్లు చూస్తే అంతా పెద్ద వాళ్లే.వ్యవస్ధపై వీరికి అంత ప్రేమా.ఎంతసేపూ రమేష్ కుమార్ పేరు చెబుతారు తప్పితే వ్యవస్ధను గురించి మాట్లాడటంలేదు. వారి ఇంటెన్సన్ ఏంటి ...ఎస్ ఇ సి ఐదేళ్లు ఉండాలనా...ఎస్ ఇ సిగా రమేష్ కుమార్ ఉండాలనా....ఆయన నిష్పాక్షికంగా ఉంటాడాని భావిస్తుంటే ఆయన అలా లేడు.ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నాడు.
 
ప్రజల ఆదరణతో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చిన పార్టీ అధ్యక్షుడ్ని,వారినేతలను ఫ్యాక్షనిస్టులుగా, వీధిగూండాలుగా,రౌడీలుగా సంభోదిస్తూ లేఖరాస్తారా....ప్రాణహాని ఉందని అంటారా....అంటే ఆయన ఆ పక్కన ఉన్నట్లు అర్దమయ్యేవిధంగా వ్యవహరించారు.
 
రాసిన లెటర్ ఓన్ చేసుకుంటావా అంటే అది లేదు.సిఐడి విచారణలో చూస్తే  లెటర్ బయటనుంచి పెన్ డ్రైవ్ ద్వారా వచ్చిందని అర్ధమైంది.అంటే ఎక్కడతయారైంది.ల్యాప్ టాప్ ఫార్మాట్ చేశారు.ఆఫీసులో ఏ సిస్టమ్ వాడలేదు.అది ఆఫీసులో కనబడలేదు.ఇదంతా ప్రీ ప్లాన్డ్ కనబడదా?

ఈ కేసులకు పెద్దలాయర్లు ఎక్కడనుంచి వచ్చారు.ఆయనకంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు.నిన్నఏజి గారు మాట్లాడగానే యనమల రియాక్ట్ అయ్యారు.దానిపై రమేష్ కుమార్ మాట్లాడటం లో అర్ధముంటుంది.రమేష్ కుమార్ నిలబడితే ప్రజాస్వామ్యం నిలబడినట్లు, జగన్ పై దుష్ప్రచారం చేయాలని వాళ్లు చేస్తున్నారు.
 
స్దానికసంస్ధల ఎన్నికలలో చాలాచోట్ల ఏకగ్రీవమయ్యాయి.మాకు గెలుపుఅవకాశాలు బాగా ఉన్నాయి.ఉన్న వ్యవస్ధలను వాడుకుని లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలనుకోలేదు.ఎన్నికలలో డబ్బు,మద్యం ప్రభావం లేకుండా చూడాలని జగన్ 
భావించారు.
 
మొదట రమేష్ కుమార్ బాగానే యాక్ట్ చేశారు.మధ్యలో రెండురోజులలో ప్రభావానికి లోనైనట్లు కనిపించింది.మేం ఖచ్చితంగా భావించింది ఏమంటే టిడిపి ఈ ఎన్నికలను ఎంతకాలం వీలైతే అంతకాలం పుష్ చేసి, వారే క్రైసిస్ క్రియేట్ చేసి, అది రాజ్యాంగసంక్షోభం అని చెప్పి డైవర్ట్ చేయాలని చూసింది.
 
తద్వారా జగన్ ప్రజారంజకపాలన నుంచి ప్రజల దృష్టిమళ్లించాలనే కుట్ర.గతంలో చంద్రబాబు ,వైయస్ రాజశేఖరరెడ్డిపై అవినీతి అంటూ ఇలానే పుస్తకాలు వేసి ప్రచారం చేశారు.కట్టల కట్టల పత్రాలు తీసుకుని ఢిల్లీ వెళ్లేవారు.వైయస్ రాజశేఖరరెడ్డి,  వైయస్ జగన్ ప్రజలకు ఎలా మేలు చేయాలనేదిశగా ఆలోచన చేస్తుంటే చంద్రబాబు విషపు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు.
 
ఈ విషయంలో ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు.ప్రజల పధకాలలో మేం విఫలమైఉంటే...పలానావి చేస్తానని చెప్పి చేయలేదంటే ప్రశ్నించవచ్చు.జగన్ ఇప్పటివరకు ఏ వ్యవస్ధపైన కూడా కామెంట్ చేయలేదు. సోషల్ మీడియా అనేది పబ్లిక్ ఓపినియెన్ క్రియేట్ అవుతుంది.దానిలో మంచిచెడ్డలున్నా కూడా అందరూ కూడా సోషల్ మీడియాను రెస్పెక్ట్ చేస్తున్నారు.
 
2009 నుంచే కాదు,టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి కుటుంబసభ్యులను చెప్పలేనివిధంగా దూషించారు.దుష్ప్రచారం చేశారు.దుర్మార్గంగా వ్యవహరించారు.అయినా కూడా ఆయన సహించారు. 2019ఎన్నికల ముందుమాత్రమే  షర్మిళ గారు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు అయితే సోషల్ మీడియాలో వచ్చిన బూతులు కూడా మాట్లాడేవిధంగా ప్రస్తావించారు.జగన్ మాత్రం వాటిని పట్టించుకోలేదు.
 
కొందరు తమ అభిమాననేతలను విమర్శలు చేస్తే వారు స్వంతంగా సోషల్ మీడియాలో పోస్టులు  చేస్తుంటారు.మా పార్టీలో మాత్రం చాలా క్రమశిక్షణగా వ్యవహరించాలని ఆదేశాలు ఉన్నాయి.విమర్శలు చేసినా డిగ్నిఫైడ్ గా చేయమని ఉంటుంది.
 
సోషల్ మీడియాలో వచ్చిన వాటిని గురించి ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురించారు.న్యాయమూర్తులు గురించి వ్యాఖ్యలను కూడా అలాగే ప్రచురించారు.అలా చేసి ఉంటే వారిపై నోటీసులు ఇవ్వండి తప్పేముంది. జడ్జిమెంట్ వస్తే టిడిపి చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది.తీర్పుపై మేం అప్పీలుకు కూడా వెళ్లకూడదనేవిధంగా మాట్లాడుతోంది.
 
గత పదిరోజులుగా జరుగుతున్నదానిని చూస్తుంటే టిడిపి ఆలోచన ఎలా ఉందంటే.... దీనిని ఎంతవరకు తీసుకువెళ్తున్నారంటే ప్రస్తుతం జరుగుతున్నదానిని ఎగ్జిక్యూటివ్ కు జ్యుడిషరీకి.... ప్రభుత్వానికి జ్యుడిషరీకి ఏదో జరుగుతున్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు.
 
జగన్ కి బెయిల్ వచ్చినప్పుడు టిడిపి సోషల్ మీడియా కూడా చాలా చేసింది. తిరిగి చూస్తే అవన్నీ బయటకు వస్తాయి. జగన్ గారిపై ఎన్నికామెంట్లు చేసినా ఆయన ఎప్పుడూ కూడా జ్యుడిషరీని ఒక్క మాట కూడా అనలేదు.
 
ఎవరైనా ఏమన్నా సరే మనకు దేవుడు అండగా ఉన్నాడని జగన్ అనేవారు.అది ప్రూవ్ అయింది కూడా.రాజమార్గంలోనే.... వ్యవస్ధలను గౌరవించే..... అధికారంలోకి రాగలమని జగన్ గారు నమ్మారు.తప్పుడు కేసులైనా సరే ఎప్పుడూ జగన్ వ్యాఖ్యానించలేదు.
 
సోషల్ మీడియా లో న్యాయమూర్తులుపై వ్యాఖ్యలు చేసారనే దానిని చూసినా దానివెనక ఏదో ఉందనే విధంగా ఉంది. జగన్ ఏరోజైనా సిస్టమ్స్ పై ఒక్కమాటన్నా అన్నారా....మాట ఎప్పుడైనా  తూలారా....ఐదేళ్లలో తాను చెప్పనవి పూర్తి చేసి తిరిగి ప్రజలకు వద్దకు వెళ్లాలనే విధంగా పనిచేస్తున్నారు.
 
మహానాడు లో జరిగింది చూస్తే ఎల్లోమీడియాలో రాస్తారు.... అది టిడిపి నేతలు మాట్లాడతారు.... అది మహానాడులో తీర్మానం అవుతుంది..లేదా ముందు టిడిపి నేతలు మాట్లాడతారు.... తర్వాత ఎల్లోమీడియాలో ప్రముఖంగా రాస్తారు....అది మహానాడు తీర్మానం అవుతుంది ఇది ఓ సైకిల్ లా ఉంది.
 
టిడిపి చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మెద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.నేషనల్  లెవల్ లో కూడా చర్చ జరుగుతుంది.రవిశంకర్ ప్రసాద్ గాని,హరీష్ సాల్వే ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇలా కోర్టుల ద్వారా చేయాలనుకునే ఆలోచన సరికాదనే అభిప్రాయంవ్యక్తం చేయడం చూశాం.

నాగేశ్వర్,తెలకపల్లి రవి లాంటి వాళ్లు అభిప్రాయాలు చూస్తున్నాం.అందరి అభిప్రాయాలు రావాలని కోరుకుంటున్నాం. వ్యవస్ధలకు లోబడి పనిచేయాలనే ఆలోచనతోనే జగన్ గారు ఉంటారు.ఆ వ్యవస్ధలంటే అత్యంత గౌరవం ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్ధలో ఆయన భాగం అని భావిస్తారు.చంద్రబాబుకు దేనిపైనా గౌరవం లేదు" అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments