Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

ఐవీఆర్
శుక్రవారం, 31 జనవరి 2025 (13:05 IST)
ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకుని అధునాతన ప్యాలెస్‌ను, తోటలను పెంచినట్లు వచ్చిన వార్తలపై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... నా తోట వున్నదని చెబుతున్నారు. సరే... పక్కనే చంద్రబాబు నాయుడు గారి తోట కూడా వున్నది. ఆ తోట భూములు ఆయన కొన్నవేనా లేదా ప్రభుత్వ భూములా.... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని తేల్చాలని అన్నారు. మా ప్రతిష్టను మంటగలిపేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనీ, మాకంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ తోటలు ఎలా వచ్చాయో తేల్చాలంటూ ప్రశ్నించారు.
 
ఇక ఆ అటవీ ప్రాంతంలో కట్టిన భవనం గురించి మాట్లాడుతూ, అడవిలో భూమి ఆక్రమించుకుని, మా పనోళ్ళ కోసం, అడవిలో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టి, వాళ్ళ కోసం మామిడి చెట్లు కూడా పెట్టాం.. అది కేవలం మా పనోళ్ళు సురక్షితంగా ఉండటం కోసం కట్టిన భవనం అని వివరించారు. పనోళ్ళ గెస్ట్ హౌస్ కోసం, అడవిలో రోడ్డు కూడా వేసినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీచేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్‌ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments