ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (12:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనరు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ఆదేశించారు.
 
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువల పెంపు లేదా తగ్గింపునకు అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కొన్ని చోట్ల రద్దీ నెలకొంది. కొన్ని చోట్ల రాత్రి వేళల్లో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగడం గమనార్హం. 
 
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీన గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలు, స్ట్రక్చర్ విలువలను సవరించాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వం విలువలను భారీగా పెంచిందని భావించిన ఏపీ ప్రభుత్వం, వీటిని సవరించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments