Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూకబ్జాకు పాల్పడితే 14 యేళ్ల జైలుశిక్ష - ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Advertiesment
jail

ఠాగూర్

, గురువారం, 7 నవంబరు 2024 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాలకు పాల్పడే వారికి 14 యేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకునిరానున్నారు. రాష్ట్రంలో ఇష్టానుసారం, ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోస ప్రస్తుతం ఉన్న భూఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు ప్రకారం ఇకపై భూఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్టంగా 14 యేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే, ఏపీ డ్రోన్ పాలసీ , డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి  సంస్థ - సీఆర్డీఏ పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించడం కోమే, ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. కానీ, కొత్త చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల రక్షణకు వీలు కల్పించనుంది. అలాగే, ఆక్రమణదారులకు 10 నుంచి 14 యేళ్ల జైలుశిక్ష, భూమి విలువతోపాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసుల పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌడీ షీటర్ బోరుగడ్డకు చికెన్ బిర్యానీ తినిపించిన పోలీసులపై వేటు...(Video)