Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం తీర్పుని కూడా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లెక్కచేయడంలేదు: టీడీపీ

Webdunia
గురువారం, 22 జులై 2021 (07:44 IST)
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రఆరోగ్యశాఖా సహయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ నిన్న రాజ్యసభలో ఒకప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆక్సిజన్ అందక కోవిడ్ సందర్భంలో మరణించిన వారు దేశంలో ఎవరూలేరనడంతో దేశప్రజానీకమంతా ఆశ్చర్యపోయిందని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
 
ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా ...! ఏపీలో అనేకఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితు లు ప్రాణాలుకోల్పోగా, రాష్రాల నుంచి తమకు అలాంటి సమాచారంరాలేదని కేంద్రమంత్రిచెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్ల, అనేకజిల్లాల్లోని అనేక ఆస పత్రుల్లో ఆక్సిజన్ సకాలంలో అందకచనిపోయినవారిని అందరంచూశాము.

తిరుపతి రుయాఆసుపత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనవైఖరి వల్ల, ఆక్సిజన్ ట్యాంకర్ సకాలంలో ఆసుపత్రికిచేరుకోకపోవడంతో నిమిషాలవ్యవధిలోనే 30మం ది చనిపోయారు. ఆనాడుజరిగిన ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెదిరిపోలేదు. రుయాఘటనతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేకఘటనలుజరిగాయి. వాటికి సంబంధించిన కథనాలు పత్రికలు, ఇతరప్రసారమాథ్యమాల్లో వచ్చాయి.

ఆక్సిజన్ కల్లోలం – కర్నూలు ఆసుపత్రిలో రెండ్రోజుల్లో 9మంది మృతి అన్న వార్త, ఊపిరిఆగింది - ఆక్సిజన్ అందక 16మంది మృతి, అనంతపురంజిల్లాలో మే2, 2021 నాటి కథనం. ఇలా అనేక కథనాలు మనముందు కనపడ్డాయి. విజయన గరంజిల్లాలోని జిల్లాఆసుపత్రిలో ఆక్సిజన్ లో అంతరాయం ఏర్పడి, కలకలంరేగిన ఘటనకూడా మర్చిపోలేదు.

ఈవిధం గా అనేకఘటనలుకళ్లముందుకనిపిస్తుంటే, కేంద్రఆరోగ్యశాఖ సహాయమంత్రి ఏవిధంగా మాట్లాడారో తెలియడంలేదు. కేంద్రమంత్రి ప్రకటనతో తమవారిని కోల్పోయిన కోవిడ్ బాధితులకుటుంబాలకు చెందిన వారు నిర్ఘాంతపోయారు. ప్రభుత్వనిర్లక్ష్యంవల్ల, ఆక్సిజన్ అందక ఏపీలో అంతమంది చనిపోయినాకూడా, మృతులకుటుంబాలకు పైసా పరిహారం కూడా ఇవ్వలేదు.

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గతంలోఒక తీర్పుఇచ్చింది. తీర్పులో సెక్షన్ 12 లోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ని ప్రస్తావించారు.  తీర్పుని గమనించినట్టయితే జూన్ 30, 2021 న సుప్రీంన్యాయమూ ర్తులు చాలాస్పష్టంగాచెప్పారు. మృతులకుటుంబాలకు పరిహారం ఇవ్వడమనేది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కానీ ఈనాటికీ కూడాప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మర ణించిన కోవిడ్ మృతులకుటుంబాలకు పైసా పరిహారం కూడా జగన్ ప్రభుత్వంఇవ్వలేదు. అదేతీర్పులోని పేరాగ్రాప్ నెం-3లో ఇంకాస్పష్టంగా మరోఅంశాన్ని ప్రస్తావించారు. 

14-03-2020న కేంద్రహోంశాఖ కోవిడ్ ను  ఒక “నోటిఫైడ్ డిజాస్టర్” గా ప్రకటించడమేకాకుండా, ఎస్డీఆర్ఎఫ్ కింద సహాయం చేయాలనికూడా కేంద్రహోంశాఖ చెప్పిందని సుప్రీం తనతీర్పులో పేర్కొంది. అటువంటి డిజాస్టర్ కారణంగా మరణించినవారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారమివ్వాలని మార్చి 2015లోనే  కేంద్రం నిర్ణయించడాన్ని సుప్రీం కోర్టు తనతీర్పులో ప్రస్తావించింది.  

ఇప్పుడు కోవిడ్ వల్ల చనిపోయినవారికుటుంబాలకు కేంద్రం ఆలోచించి న్యాయబద్ధమైన పరిహారమిచ్చేలా తక్షణమే మార్గదర్శకాలు రూపొందించాలనికూడా సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. మరణధృవీకరణ పత్రాలకు సంబంధించి కూడా సుప్రీం కొన్నిసూచనలు చేసింది. సక్రమమైన పద్ధతిలో మరణధృవీకరణ పత్రాలు అధికారులుఇవ్వకపోతే, మృతులకుటుంబాలకు అన్యాయం జరగుతుందికాబట్టి, కోవిడ్ తో చనిపోయిన ప్రతివ్యక్తికి చెందిన మరణ ధృవీకరణ పత్రాలను తక్షణమే ఇవ్వాలని, కోవిడ్ తో  మరణించారని కూడా దానిలో పేర్కొనాలని న్యాయస్థానం చెప్పింది. 

కోవిడ్ మరణాలకు సంబంధించిన మరణ ధృవీకరణపత్రాలు ఇవ్వకుండా కావాలనే జగన్ ప్రభుత్వం కోవిడ్ మరణాలను తొక్కిపెట్టింది. గత మే-జూన్ మాసాల్లోనే సాధారణ మరణాలకంటే అధికంగా లక్షా68వేలమరణాలు నమోద య్యాయని కూడా కేంద్ర జననమరణాల విభాగం  చెప్పింది.  ఏప్రియల్, మే, జూన్ నెలల్లోనే 2లక్షల5వేల518 మంది మరణించినట్లు సదరువిభాగం చెప్పింది.

సాధారణంగా ఒక్కోనెలలో 30నుంచి 35వేల మరణాలు ఏటా నమోదైతే, ఈసంవత్సరంలోమాత్రం మే-జూన్ మాసాల్లో  లక్షా 68వేల మరణాలు అత్యధికంగా నమోదయ్యాయని కూడా  అనేకపత్రికల్లో కథనాలువచ్చాయి. కేంద్రప్రభుత్వసమాచారం ప్రకారమే మరణాలు లక్షల్లోఉంటే, ఏపీలో మాత్రం వాటిసంఖ్యను కొన్నివేలల్లో  చూపారు.  కోవిడ్ మృతులకు ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనన్న నీచబుధ్ధితోనే జగన్ ప్రభుత్వం కోవిడ్ మరణాలనుతొక్కిపెట్టింది.

తెలుగుదేశంపార్టీ ఇదివరకే కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు,ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబాలకు రూ.25లక్షలు అందించాల ని డిమాండ్ చేసింది. కోవిడ్ తో తమవారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తూ, చంద్ర బాబునాయుడుగారు సాధనదీక్షకూడాచేశారు. కోవిడ్ తో మరియు ఆక్సిజన్ అందక రాష్ట్రంలో లక్షలమంది చనిపోతే, జగన్ ప్రభుత్వం కేంద్రానికితప్పుడు సమాచారమిచ్చింది.

కేంద్ర ఆరోగ్యశాఖా సహాయమంత్రిపార్లమెంట్ లో చెప్పిన సమాధానమే అందుకునిదర్శనం.  కోవిడ్ కారణంగా కుదేలైనవారిని ఆదుకోవడానికి అనేకరాష్ట్రాలువేలకోట్ల ప్యాకేజీలుప్రకటించాయి. కేరళ రూ.22వేలకోట్లు, గుజరాత్ రూ.14వేలకోట్లు, తమిళనాడు రూ.5వేలకోట్లు, మహారాష్ట్ర రూ.6వేలకోట్లు ప్రకటించాయి. బీహార్ ప్రభుత్వం ప్రతి కోవిడ్ మరణానికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

దానితోపాటు అనేక రాష్ట్రాలు నష్టపరిహారం ప్రకటించాయి. కానీ పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కోవిడ్ తో చనిపోయినవారి కుటుంబాలకు పైసాకూడా ప్రకటించలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మరణించినవారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇప్పించిన ముఖ్యమంత్రి, తన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పైసా కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నాను.

ఆక్సిజన్ అందక మరణాలుసంభవించిన ఘటనల్లో బాధ్యు లపై ప్రభుత్వం ఎందుకుఇప్పటివరకుచర్యలు తీసుకోలేదు? కేంద్రఆరోగ్యశాఖకు తప్పుడుసమాచారమిచ్చి, పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నప్రభుత్వం, మరో పక్కన మూడునెలలకాలంలోనే 2లక్షల05వేలమంది ఈ ఏడాదికోవిడ్ కారణంగా చనిపోతే, ఆ మరణాలను కూడా దాచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం.

సుప్రీంకోర్టు తీర్పుప్రకారం ఉభయప్రభుత్వాలు చర్యలుతీసుకోవాల్సిందే. తీర్పువచ్చి ఇప్పటికే మూడు వారాలైంది. తీర్పులోచెప్పినట్లుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కో విడ్ మృతుల కుటుంబాలకు అందించే పరిహారంపై మార్గ దర్శకాలు రూపొందించాల్సిందే. సక్రమమైన పద్ధతిలో మరణధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందే.

కోవిడ్ తో తమవారి ని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సాయం అందిం చాల్సిందే. లేకుంటే టీడీపీపక్షాన కోవిడ్ మృతుల లెక్కలను బయటకుతీసి, తమవారిని కోల్పోయిన కుటుంబాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. గ్రామాలవారీగా కోవిడ్ మృతులవివరాలను సేకరించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ముందుంచే బాధ్యతను టీడీపీ తీసు కుంటుంది.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వాలున్యాయం చేసేవరకు ఎవరినీ వదిలిపెట్టేపనిలేదు. అప్పులకోసం బొచ్చెలు పట్టుకొని తిరుగుతున్న ఏపీప్రభుత్వం, కోవిడ్ మృతులకుటుంబాలకు సాయంచేయాల్సిందే. కోవిడ్ తో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబాలకు  రూ.25లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments