Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వల్ప వ్యవధిలోనే 300 కిసాన్‌ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

Advertiesment
స్వల్ప వ్యవధిలోనే 300 కిసాన్‌ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
, శుక్రవారం, 2 జులై 2021 (09:09 IST)
దక్షిణ మధ్య రైల్వేలో 300వ కిసాన్‌ రైలు నిన్న అనగా 30 జూన్‌ 2021 తేదీన విజయవంతంగా రవాణా చేయబడినాయి. జోన్‌లో 10 నెలల కాల వ్యవధిలోనే 300 కిసాన్‌ రైళ్లను విజయవంతంగా నడపడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అమితానందం వ్యక్తం చేశారు.

ఈ 300వ కిసాన్‌ రైలు 246 టన్నుల ఉల్లిపాయల లోడ్‌తో మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌ నుండి పశ్చిమ బెంగాల్‌లోని చిత్‌పూర్‌కు రవాణా అయ్యింది. రైతుల, వ్యాపారస్తుల సరుకులను భద్రంగా, సురక్షితంగా, వేగంగా మరియు ఆర్థిక ప్రయోజనకరంగా ఉంటూ మార్గమధ్యలో వారి సరుకులు చెడిపోకుండా రవాణా చేయడానికి భారతీయు రైల్వే కిసాన్‌ రైలును ప్రారంభించింది.

దీనికి అదనంగా కిసాన్‌ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఫుడ్‌ ప్రాససింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘‘ఆపరేషన్స్‌ గ్రీన్స్‌`టీఓపీ టు టోటల్‌’’ పథకం కింద రాయితీని అందజేస్తుండడంతో ఈ కిసాన్‌ రైళ్ల ద్వారా రైతులు/వ్యాపారస్తులు వారి ఉత్పత్తులను రవాణా చేస్తూ 50% రాయితీ పొందుతున్నారు.

నేటివరకు, జోన్‌లోని వివిధ స్టేషన్ల నుండి వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసిన రైతులు మరియ వ్యాపారస్తులకు మొత్తం 22.2 కోట్ల సబ్సిడీ లభించింది.  మొత్తంమీద జోన్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కిసాన్‌ రైళ్ల ద్వారా 01 (ఒక) లక్ష టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా అయ్యాయి.

దక్షిణ మధ్య రైల్వేలో కిసాన్‌ రైలు రవాణా విధానం భారీ విజయం సాధించింది. వీటిని ప్రవేశపెట్టిన నాటి నుండి ఈ రైళ్ల రవాణాకు నిరంతరం డిమాండ్‌ ఏర్పడిరది. ప్రతి 100వ కిసాన్‌ రైలు మునుపటి కాలం కంటే తక్కువ వ్యవధిలో రవాణా అయ్యాయి. మొదటి 100 కిసాన్‌ రైళ్ల రవాణాకు 187 రోజులు పడితే,  రెండో 100 కిసాన్‌ రైళ్ల రవాణాకు 63 రోజులు, ప్రస్తుతం మూడో 100 కిసాన్‌  రైళ్ల రవాణా 45 రోజుల్లోనే సాధ్యపడిది.

జోన్‌ పరిధిలోకి వచ్చే మూడు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి వివిధ కూరగాయలు మరియు పండ్లను కిసాన్‌ రైళ్లు రవాణా చేశాయి. అంతేకాక, దేశంలోని వివిధ సుదూర ప్రాంతాలకు కూడా అనేక వ్యవసాయ ఉత్పతులను రవాణా చేశాయి. ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి సమయంలో రైతుల/వ్యాపారస్తుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటు లభించడానికి ఈ రైళ్లు ఎంతో తోడ్పడుతున్నాయి.

సరుకు రవాణా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, నూతన మైలు రాయిని అధిగమించడంలో శ్రమించిన జోన్‌ మరియు డివిజన్లలోని అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. నిత్యవసర  వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ ఏర్పడడంలో తమ జోన్‌ మద్దతుగా నిలబడడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపిలో పర్యాటకుల భద్రత కోసం కమాండ్ కంట్రోల్ రూములు