Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి తాపం : ముందు జాగ్రత్తలు చేపట్టిన దక్షిణమధ్య రైల్వే

వేసవి తాపం : ముందు జాగ్రత్తలు చేపట్టిన దక్షిణమధ్య రైల్వే
, గురువారం, 11 మార్చి 2021 (11:38 IST)
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మ్యా 10 మార్చి 2021 తేదీన జోన్‌ పరిధిలో భద్రత, సరుకు రవాణా మరియు రైళ్ల రాకపోక సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులు, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ విభాగాల డివిజినల్‌ రైల్వే మేనేజర్లు ఈ వెబ్‌ సమావేశంలో పాల్గొన్నారు. 
 
వేసవి కాలంలో రైల్వే స్టేషన్‌ పరిసరాలలు, రైళ్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని, అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గజానన్‌ మ్యా కోరారు. ముఖ్యంగా కార్యాలయ భవనాల వద్ద అగ్ని ప్రమాద నివారణకు తనిఖీలు చేపట్టాని ఆయన అధికారుందరినీ ఆదేశించారు. పని ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అనవసర సామగ్రిని స్క్రాప్‌ చేయాని జనరల్‌ మేనేజర్‌ అధికారులకు సూచించారు. 
 
ముఖ్యమైన ప్రాంతాల్లో స్మోక్‌ డిటెక్టర్స్‌, ఫైర్‌ అలారం వంటి భద్రతా పరికరాలు తనిఖీలు, నిర్వహణ క్రమంగా చేపట్టాని అన్నారు. అన్ని పరిసరాలలో తప్పకుండా వాటర్‌ హైడ్రంట్స్‌, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
 
వేసవికాలంలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించి రక్షిత చర్యలు చేపట్టాని జనరల్‌ మేనేజర్‌ అధికారుకు సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ట్రక్ వద్ద పనిచేసే సిబ్బంది పనివేళల్లో మార్పు చేయాలని వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా జనరల్‌ మేనేజర్‌ కోరారు. 
 
జోన్‌లోని రైళ్ల నిర్వహణ భద్రతపై గజానన్‌ మ్యా వివరణాత్మకమైన సమీక్ష నిర్వహించారు. లోకో స్టాఫ్‌కు రెగ్యుర్‌ కౌన్సెలింగ్‌ తప్పనిసరి అని జనరల్‌ మేనేజర్‌ పునరుద్ఘాటించారు. అవాంఛనీయ ఘటన నివారణకు లేదా అభద్రతా పరిస్థితుల్లో తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఫీల్డ్‌ స్టాఫ్‌ను చైతన్య పరచాలని అధికారులకు ఆయన సూచించారు. రైళ్లు సజావుగా సాగడానికి అన్ని మార్గదర్శకాలకు కట్టుబడాలని, భద్రతా చర్యను కఠినంగా అమలు చేయాని ఆయన అధికారులకు సూచించారు.
 
జోన్‌లో సరుకు రవాణా లోడింగ్‌పై జనరల్‌ మేనేజర్‌ సమీక్ష జరిపారు. సరుకు రవాణా లోడింగ్‌లో ముఖ్యంగా సిమెంట్‌, గ్రైనేట్‌, జిప్సం, ఫ్లైయాష్‌ వంటి సరుకు రవాణా అభివృద్ధికి కృషి చేసిన అధికారుల ఆయన అభినందించారు. సరకు రవాణాకు సంబంధించి బిజినెస్‌ డెవప్‌మెంట్‌ యూనిట్ల (బీడీయూ)పై డివిజనల్ రైల్వే మేనేజర్లతో ఆయన సమీక్షించారు. జోన్‌లో సరుకు రవాణా లోడిరగ్‌ అభివృద్ధిపై ఆయన బీడీయూను అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిచిగాన్ హైవేలో జింకల గుంపు.. షాకైన డ్రైవర్లు.. వీడియో వైరల్