Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపిలో పర్యాటకుల భద్రత కోసం కమాండ్ కంట్రోల్ రూములు

Advertiesment
Command control rooms
, శుక్రవారం, 2 జులై 2021 (09:04 IST)
రాష్ట్రంలో పర్యాటకుల భద్రతే ధ్యేయంగా 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గండి పోచమ్మ ఆలయం వద్ద పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు పర్యాటకుల భద్రత రక్షణ కొరకు గండి పోచమ్మ పోచవరం రాజమహేంద్రవరం పశ్చిమగోదావరి జిల్లాలో సింగంపల్లి పేరంటాలపల్లి విశాఖ జిల్లా రుషికొండ గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం కృష్ణాజిల్లా బేరం పార్క్ లవద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కంట్రోల్ రూమ్ లో జలవనరుల శాఖ పర్యాటక శాఖ పర్యాటక శాఖ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందుబాటులో ఉంటారని మీరు లాంచీల రాకపోకలు మరియు  పర్యాటకుల రక్షణకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం పర్యాటకశాఖకు రెండు లాంచీలు ప్రైవేట్ సంబంధించి నాలుగు లాంచీలు లైసెన్స్ లకొరకు అనుమతులు పొందాయని ఆయన స్పష్టం చేశారు కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ సర్వే లెను అగ్నిమాపక కేంద్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ పి ఎ.సిస్టం కంప్యూటర్ సెటప్ సమాచారవ్యవస్థ టికెట్ కౌంటర్ ఉంటాయని పాపికొండలు బోటింగ్ ఆపరేటింగ్ కొరకు నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

లాంచీలలో కెపాసిటీకి తగిన విధంగా పర్యాటకులను ఎకించుకోవాలని సూచించారు లాంచీలలో లైఫ్ జాకెట్లు అగ్నిమాపక యంత్రాలు ప్రాథమిక చికిత్స కిట్టు శాటిలైట్ ఫోన్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ పరికరాలు బైనాక్యులర్స్ పిఎ సిస్టం లు అందుబాటులో ఉంటాయన్నారు.

గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర  ప్రభుత్వం పటిష్టమైన భద్రతా వ్యవస్థ ను అమల్లోకి తెచ్చింది అన్నారు. కరోనా మూలంగా పర్యాటక యాత్రను పునరుద్ధరించడానికి సమయం పట్టిందని 2019 సెప్టెంబర్ 15 న కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో పర్యాటక పరంగా సమూలమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని తదనుగుణంగా భద్రతా వ్యవస్థను పటిష్టపరచడం జరిగిందన్నారు .

పడవలలో పర్యాటకులు మద్యం సేవించ రాదని పాపికొండలు  ప్రకృతిని ఆస్వాదించాలని ఆయన స్పష్టం చేశారు గోదావరి తీరం వెంబడి ఉన్న గిరిజనులకు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక పరంగా ఉపాధి పొందుతున్న 200 మంది ఉపాధిని పెం దించడానికి గురువారం పాపికొండలు విహార యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు పాలవరం ప్రాజెక్టు వద్ద ఇమేజ్ పార్కును రెస్టారెంట్లను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడి అని నెల రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటకులు దృష్టి పోలవరం ఉభయగోదావరి ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు అదే విధంగాఉభయ గోదావరి జిల్లాలో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి పరచి భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందన్నారు.

గోదావరి తీరం వెంబడి పర్యాటకుల తాకిడి కి అనుగుణంగా బోటింగ్పాయింట్లను పెంచడం జరుగుతుందన్నారు గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఎక్కడ నిర్లక్ష్యానికితావులేకుండా  పలురకాల శిక్షణలో ఇప్పించి ఆయా శిక్షణ పొందిన వారిని ఈ లాంచీల లో నియమించడం  జరిగిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డుపై తల... - రైలు పట్టలలపై మొండెం.. ఎక్కడ?