Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడిరోడ్డుపై తల... - రైలు పట్టలలపై మొండెం.. ఎక్కడ?

నడిరోడ్డుపై తల... - రైలు పట్టలలపై మొండెం.. ఎక్కడ?
, శుక్రవారం, 2 జులై 2021 (09:00 IST)
తెలంగాణా రాష్ట్రలో పాతకక్షలతో జరుగుతున్న హత్యల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో తల లేని మొండెం ఒకటి లభించింది. ఈ తల ఖమ్మం రైల్వేలో గ్యాంగ్‌ మ్యాన్‌గా పని చేస్తూ రైల్వేకార్టర్స్‌లో ఉంటున్న గుగులోతు రాంజీ కుమారుడు గుగులోతు రాజు(28)గా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజుకు గత యేడాది వివాహం జరిగింది. రెండు నెలల క్రితం భార్య ప్రసవించి పుట్టింట్లో ఉంది. ఈ క్రమంలో రాజు గత కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డారు. ఆయన ఇవ్వనని చెప్పడంతో మనస్తాపానికి గురై రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నగరంలోని నర్తకి థియేటర్‌ సమీపంలో రైలు వస్తున్న సమయంలో ఎదురుగా వెళ్లి పట్టాలపై తల పెట్టాడు. దీంతో తల, మొండెం రెండుగా వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ విషయాన్ని లోకో పైలట్‌ ఖమ్మం స్టేషన్‌ మాస్టర్‌కు తెలియజేశారు. రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) మృతదేహం కోసం ప్రకాశ్‌నగర్‌ రైల్వే వంతెన దగ్గర నుంచి ధంసలాపురం గేటు వరకు వెతికారు. మృతదేహం లభించకపోవడం, అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో వెనక్కి వచ్చేశారు. గురువారం ఉదయం నర్తకి థియేటర్‌ ఎదురుగా రైలు పట్టాలపై శవం పడి ఉండడాన్ని గమనించిన ఓ కుక్క మొండెం నుంచి వేరైన తలను పట్టుకుని పరుగు లంకించుకుంది. 
 
దానిని ప్రకాశ్‌నగర్‌ వంతెన వద్ద రోడ్డుపైనే పడేసి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు మొండెంలేని తలను చూసి గురయ్యారు. కేవలం తల మాత్రమే ఉండడంతో ఎక్కడో హత్య చేసి తలను ఇక్కడ పడేసి ఉంటారని అనుమానించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ తలను ఓ సంచిలో వేసి అక్కడి నుంచి తొలగించారు.
 
ఉదయం నర్తకి థియేటర్‌ వద్ద రాజు మొండాన్ని స్వాధీనం చేసుకున్న జీఆర్‌పీ పోలీసులు తల కోసం రైలు పట్టాల వెంట వెతికారు. కానీ అది అభించలేదు. ఈలోగా ప్రకాశ్‌నగర్‌ వంతెన వద్ద మనిషి తల ఉందని తెలియడంతో అక్కడికి చేరుకుని అది రాజు తలగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోద చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల వివాదంపై ప్రధాని మోదీకి జగన్‌ లేఖ