Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ కు స‌పోర్ట్ లేదు... అమరావతి రైతులవైపే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:09 IST)
సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలిపారు. దీనితో ఆయ‌న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌పోర్ట్ చేస్తున్నార‌నే వాద‌న‌కు తెర‌ప‌డింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ, యాత్రలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
 
 
ఏపీకి అమరాతి ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా ఇప్పటికే పలు పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తాజాగా.. సీబీఐ మాజీ జేడి వి వి లక్ష్మీనారాయణ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి నెల్లూరు జిల్లా బాలాయపల్లి  పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులు వారి ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శలు చేయటం సరి కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వారు పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
 
రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరిగిపోతుంద‌ని, రాజధాని ఒకే చోట పెట్టుబడులు వస్తాయని..పెట్టుబడులు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వాలు మారినా పాలసీల్లో మార్పులు సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి  జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


హై కోర్ట్ ఒక చోటే వుండి అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లుగా , అసెంబ్లీ ని అమరావతి లో ఉంచి ఒక సెస్సేషన్ ను ఒక సరి విశాఖ పట్నంలోనూ, ఇంకోసారి కర్నూల్లోను పెట్టవచ్చని అన్నారు. మహారాష్ట్రలో కూడా అదే విధంగా జరుగుతుందని, ఈ సందర్భంగా ఆయన అన్నారు.  రైతుల పాద యాత్రకు మద్దతిచ్చిన వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. 
అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments