Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. ఒకే ఫ్యామిలీలో...

Advertiesment
రాజస్థాన్‌లో  9  ఒమిక్రాన్ పాజిటివ్  కేసులు.. ఒకే ఫ్యామిలీలో...
, సోమవారం, 6 డిశెంబరు 2021 (07:49 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 9 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒకేసారి ఇన్ని కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌, ఆదర్శ్ నగర్‌లో నివసించే ఓ కుటుంబ సభ్యులందరూ వారం రోజుల క్రితం సౌతాఫ్రికాకు వెళ్లి వచ్చారు. అయితే, కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో వీరందరికీ ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులే 9 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో వీరిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫ్యూ తరహా పరిస్థితులను అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులతో కలుపుకుని దేశ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో ఏడు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!