Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎన్నికల్లో పోటీ చేశారు... రాజకీయ లబ్ది కోసమే పిటిషన్ : కేంద్రం

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:20 IST)
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకంగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన న్యాయవాది విచిత్ర వాదనలు వినిపించారు. వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొన్నారు. అందువల్ల లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణ అర్హత లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. 
 
దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం.. ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments