వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుగా భావించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
ఈ నేపథ్యంలో కార్మికుల ఉద్యమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అంతేగాక స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ పంపారు. ఇదేసమయంలో వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతూ... కార్మికుల ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు.
మరోవైపు, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీతో పాటు, తెలుగుదేశం, అధికార వైకాపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.