Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీజీఎస్ ను సందర్శించిన కాగ్ అధికారులు... టెక్నాల‌జీ వినియోగానికి కితాబు

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (08:18 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్న రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ఒక వినూత్న ప్ర‌క్రియ‌ని \
భార‌త‌ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) అధికారులు ప్ర‌శంసించారు. గురువారం కాగ్ డిప్యూటీ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్య్రూ డ‌బ్ల్యూ.కె.లాంగ్‌స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ స్టేట్ క‌మాండ్ కేంద్రాన్ని సంద‌ర్శించింది. 
 
ఆర్టీజీఎస్ సీఈఓ బాబు ఏ అధికారుల‌కు స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌జ‌ల‌కు రియ‌ల్ టైమ్‌లో ఆర్టీజీఎస్ ద్వారా ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌ల గురించి, న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో టెక్నాల‌జీ ఎలా ఉప‌యోగించుకుంటున్న‌దీ వివ‌రించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా వినియోగించుకుంటోంద‌ని వివ‌రించారు.  
 
గ్రామ వాలంటీర్లు, స్పంద‌న, అమ్మఒడి, రైతు భ‌రోసాలాంటి ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం టెక్నాల‌జీని స‌మ‌ర్థంగా వినియోగించుకుంటోంద‌ని వివ‌రించారు. కాగ్ అధికారులు మాట్లాడుతూ ఆర్టీజీఎస్ ప‌నితీరు అద్భుతంగా ఉంద‌న్నారు. న‌వ‌ర‌త్నాలను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డంలో ఆర్టీజీఎస్ చాలా బాగ ప‌నిచేస్తోంది.  గ్రామ వాలంటీర్లు, అమ్మ ఒడి, స్పంద‌న లాంటి కార్య‌క్ర‌మాల అమ‌లు ఆద‌ర్శ‌నీయంగా ఉంద‌న్నారు. 
 
వేగంగా, పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లు అందించ‌డానికి ఆర్టీజీఎస్ టెక్నాల‌జీ వినియోగిస్తున్న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. రియ‌ల్ టైమ్‌లో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌లను కాగ్ అధికారులు ప్ర‌శంసించారు.  ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో ఇంత మంచి స‌దుపాయం ఉండ‌టం అద్భుతంగా ఉంద‌న్నారు. 
 ఆర్టీజీఎస్ ద్వారా రియ‌ల్ టైమ్‌లో ప్ర‌భుత్వం వేగంమ‌గా ప‌నిచేయ‌డాన్ని కాగ్ అధికారులు ఆస‌క్తిగా తెలుసుకున్నారు. 
ఇంత మంచి వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వాని\కి కాగ్ అధికారులు అభినంద‌న‌లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments