Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం"... 23న వృద్ధులు, దివ్యాంగులకు, 24న తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (07:57 IST)
శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా జూలై 23వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. 
 
ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
 ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.
 
 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. 
 
సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24న సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments