Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొండా ఉమ బంగీ జంప్ దేనికి సంకేతం?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:25 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు బంగీ జంప్ విన్యాసాలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన న్యూజిలాండ్‌లో బంగీ జంప్ చేశారు. 
 
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారుతారనే చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇపుడు చేసిన ఓ ట్వీట్‌తో టీడీపీ నేతల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. విదేశాల్లో ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలను ఆ ట్వీట్‌కు జోడించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 
 
సాధారణ ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వర రావు కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు. 
 
దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్‌ డిమాండ్‌ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ దాన్ని కొట్టివేశారు. దీంతో ఆయన కాస్త అసంతృప్తికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments